RRR : ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు ఒకటే మాట.. ఆస్కార్.. ఆస్కార్..ఇప్పుడు ఎక్కడ విన్నా ఇదే పేరు మారుమోగుతుంది. ప్రపంచమంతా ఈ అవార్డ్స్ వేడుకల కోసం వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. ప్రపంచంలోని సినీ నటులు మరియు సాంకేతిక నిపుణులు ప్రతిష్టాత్మకంగా భావించే పురస్కారం ఆస్కార్. ఇక అవార్డుని అందుకోకపోయిన పర్వాలేదు, ఒక్కసారైనా ఆస్కార్ రెడ్ కార్పెట్ పై నడిస్తే చాలు అదే గౌరవంగా భావిస్తుంటారు ప్రతిఒక్కరు.. ఆ రెడ్ కార్పెట్ పై నడిచేందుకు ప్రత్యేకమైన డిజైన్ వేర్ తో సిద్దమయ్యి వస్తుంటారు. అయితే ఈ ఏడాది ఆస్కార్ తన కార్పెట్ రంగుని మారుస్తూ నిర్ణయం తీసుకుంది. రెడ్ కార్పెట్ కాస్త షాంపైన్ రంగులోకి మారిపోయింది. రంగు మార్చడం గురించి అకాడమీ కచ్చితమైన రీజన్ అయితే వెల్లడించనప్పటికీ ఇది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది..

ఆస్కార్ ప్రత్యేకతలను ఒకసారి చూద్దాం..ఈ ఆస్కార్ లో జిమ్మీ కిమ్మెల్ మూడవసారి హోస్ట్ గా చేస్తున్నాడు. కానీ అతను స్టేజి మీదకి రాకముందే వాలెట్ హబ్ దగ్గర బిగ్ డ్యాన్స్ ఏర్పాటు చేసారు నిర్వాహకులు. ఇక ఆస్కార్ ఖర్చు మొత్తం 56. 6 మిలియన్ డాలర్స్ అవుతుందట. ఈ ఖర్చులో ముఖ్యంగా ఆ లిస్ట్ నటి రెడ్ కార్పెట్ దగ్గర వేసుకునే డ్రెస్ ఖర్చు 10 మిలియన్ డాలర్స్ వుంటుందట. ఇప్పటివరకు రెడ్ కార్పెట్‍లో అత్యంత ఖరీదైన లుక్ లో కనిపించింది లేడీ గాగా , ఆమె 2019 లో ఆమె మెడలో ధరించిన పసుపు రంగు 128 క్యారెట్ డైమండ్ ఖరీదు 30 మిల్లియన్ డాలర్స్ ఇదే ఇప్పటివరకు రికార్డు.

కాగా,ఈసారి రెడ్ కార్పెట్ పేరుకు మాత్రమే కార్పెట్ రంగు మాత్రం రెడ్ కాదు..షాంపైన్ కలర్ ను మార్చేశారు. అయితే..961 తర్వాత మొదటిసారి కార్పెట్ కలర్ ని ఈసారి మారుస్తున్నారు. ఈ కార్పెట్ 50 000 స్క్వేర్ ఫీట్ ఉంటుంది. దీని ధర 24 వేల 700 డాలర్స్ అంట. ఇది మొత్తం ఇంస్టాల్ చేయడానికి 600 గంటలు సమయం పట్టింది అని చెప్తున్నారు. ఒకవేల ఆస్కార్ ఈవెంట్ లో ప్రకటన ఇవ్వాలి అనుకునేవాళ్ళకి 30 సెకన్లకు 2 మిలియన్ డాలర్స్ పే చేయాల్సి వస్తుందట… కొద్ది గంటల్లో ఆస్కార్ వేడుక మొదలు కానుంది..