RRR Movie : దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన #RRR చిత్రం గురించి ప్రస్తుతం ప్రపంచం మొత్తం మాట్లాడుకుంటుంది.రాజమౌళి దర్శకత్వ ప్రతిభకు మరియు రామ్ చరణ్ – ఎన్టీఆర్ అద్భుతమైన నటనకు అవార్డులు రివార్డులు వస్తూనే ఉన్నాయి.అయితే జూనియర్ ఎన్టీఆర్ కంటే రామ్ చరణ్ కి హాలీవుడ్ లో ఎక్కువ పాపులారిటీ రావడం, జేమ్స్ కెమరూన్ మరియు స్పెల్ బర్గ్ వంటి దిగ్గజ హాలీవుడ్ దర్శకులు కూడా రామ్ చరణ్ పోషించిన పాత్రపై ప్రశంసల వర్షం కురిపించడం వంటివి నందమూరి అభిమానులకు మింగుడు పడడం లేదు.ఇక రీసెంట్ గా హాలీవుడ్ లో ప్రతీ ఏడాది నిర్వహించే అత్యంత ప్రతిష్టాత్మకమైన ‘HCA అవార్డ్స్’ కి రామ్ చరణ్ హాజరవ్వడం.’బెస్ట్ వాయిస్ / మోషన్ కాప్చర్’ అవార్డు కి ప్రెజెంటర్ గా వ్యవహరించడం, మరియు స్పాట్ లైట్ అవార్డు ని దక్కించుకోవడం వంటివి టాక్ ఆఫ్ ది ఇండియా గా మారింది.

ముఖ్యంగా అంత పెద్ద అంతర్జాతీయ వేదికపై ఒక తెలుగు హీరో హాలీవుడ్ సినిమాకి అవార్డు ఇవ్వడం అనేది సాధారణమైన విషయం కాదు,దేశం గర్వించదగినది.అందుకే సినీ సెలెబ్రిటీలందరు రామ్ చరణ్ కి శుభాకాంక్షలు తెలియచేస్తున్నారు.అంతే కాకుండా స్పాట్ లైట్ అవార్డు ని గెలుచుకున్నందుకు గానూ ప్రత్యేకించి అభినందనలు తెలియజేస్తున్నారు.ఇలా కేవలం రామ్ చరణ్ మాత్రమే హైలైట్ అవ్వడం పై ఎన్టీఆర్ అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.తమ హీరో కి కూడా స్పాట్ లైట్ అవార్డు వచ్చిందని, అవార్డ్స్ ఈవెంట్ కి రాలేదని ఇవ్వలేదు అంటూ చెప్పుకొచ్చారు.

మరోపక్క చిరంజీవి మరియు పవన్ కళ్యాణ్ స్థాయి హీరోలు కూడా రామ్ చరణ్ కి ప్రత్యేకించి శుభాకాంక్షలు తెలియచేయడం తో నందమూరి ఫ్యాన్స్ మరింత హర్ట్ అయ్యారు.దీనితో ఎన్టీఆర్ కి డ్యామేజీ జరుగుతుందని గమనించిన #RRR మూవీ టీం స్పాట్ లైట్ అవార్డు ముగ్గురుకి వచ్చినట్టు గా ఒక ప్రత్యేకమైన ట్వీట్ వేసింది.ఎన్టీఆర్ కి డ్యామేజీ జరుగుతుందని గమనించి వెంటనే స్పందించిన #RRR మూవీ టీం, రామ్ చరణ్ కి ఇలా జరిగినప్పుడు మాత్రం ఎందుకు రియాక్ట్ అవ్వలేదు అంటూ మెగా ఫ్యాన్స్ #RRR మూవీ టీం పై మండిపడ్డారు.
Thank you, @ZachSMarsh, for the amazing edit.
— RRR Movie (@RRRMovie) February 26, 2023
Also, thank you to @HCACritics for presenting personalized Spotlight Awards to our @ssrajamouli, @tarak9999, @alwaysramcharan, and all of our RRR cast and crew. 🤗❤️🙏🏻 https://t.co/3gDmRSWsk7
జేమ్స్ కెమరూన్ రామ్ చరణ్ పాత్ర గురించి ప్రత్యేకించి చెప్పడం ని ట్రిమ్ చేసి #RRR మూవీ టీం అప్పట్లో ఒక ట్వీట్ వెయ్యడం పెద్ద దుమారం రేపింది.ఆ తర్వాత ఆస్కార్ అవార్డు ఎన్టీఆర్ కి వస్తుందంటూ వెరైటీ మ్యాగజైన్ ద్వారా తెగ ప్రచారం చేయించింది.ఇప్పుడు HCA అవార్డ్స్ విషయం లో రామ్ చరణ్ హైలైట్ అయిపోతున్నాడని గమనించి వెంటనే ఎన్టీఆర్ కోసం ట్వీట్ వేసింది.ఇలా ప్రతీ ఒక్కటి ఎన్టీఆర్ పై ప్రత్యేక శ్రద్ద చూపిస్తూ వచ్చిన #RRR మూవీ టీం రామ్ చరణ్ మీద మాత్రం ఎందుకు అంత వివక్ష చూపిస్తుందని మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియా లో ప్రశ్నిస్తున్నారు.
