RRR ఒక పక్క మూవీ కి ఆస్కార్ అవార్డు వచ్చిందని దేశం మొత్తం గర్విస్తూ ఉంటే,మరోపక్క కొంతమంది సెలబ్రిటీస్ #RRR మూవీ మీద లేని పోనీ ఆరోపణలు చేస్తున్నారు.వీళ్ళని ఏమనాలో కూడా తెలియడం లేదు అని అంటున్నాడు ఆ చిత్ర నిర్మాత డీవీవీ దానయ్య.#RRR మూవీ కి ఆస్కార్ అవార్డు కోసం మూవీ టీం 80 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేసారు అని.

అంత అవసరం ఎందుకు దాంతో నేను 8 సినిమాలు చేస్తాను అంటూ ప్రముఖ నిర్మాత తమ్మా రెడ్డి భరద్వాజ అన్న మాటలకు సోషల్ మీడియా లో ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో అందరం చూసాము.అంతే కాదు ఒకప్పుడు ఆయన #RRR మూవీ కి నిర్మాత చిరంజీవి అని, డీవీవీ దానయ్య కేవలం చిరంజీవి కి బినామీ లా ఉన్నాడు అంటూ కూడా వ్యాఖ్యలు చేసాడు.వీటి అన్నిటి పై డీవీవీ దానయ్య తనదైన శైలిలో సమాధానం చెప్పాడు.

ఇటీవల జరిగిన ఒక ఇంటర్వ్యూ లో దానయ్య వద్దకు విలేఖరులు ఈ ప్రశ్న అడగగా ‘అలా చెప్పిన ఆ పెద్ద మనిషిని నా దగ్గరకి తీసుకొని రండి.చిరంజీవి గారు నాతో డబ్బులు పెట్టి సినిమాలు తియ్యడం ఏందీ.చేసుకోవాలనుకుంటే డైరెక్ట్ గా ఆయనే చేసుకుంటాడు కదా. ఖైదీ నెంబర్ 150 మరియు సైరా నరసింహా రెడ్డి వంటి సినిమాలు ఆయనే నిర్మించుకున్నాడు.ఇలాంటి కామెంట్స్ చేసే అతనికి అసలు బుర్ర అనేదే ఉండదు అని అర్థం అయ్యింది.నాకు డబ్బులు పెట్టడానికి నా ఫైనాన్షియర్స్ ఉన్నారు.ఏ నిర్మాతకి అయినా ఇంతే, కొంత వరకు డబ్బులు మా దగ్గర ఉన్నవి పెట్టుకుంటాం, మిగిలినవి ఫైనాన్షియర్స్ ద్వారా తీసుకుంటాము’ అంటూ దానయ్య చాలా ఘాటుగా స్పందించాడు.నోట్లో నాలుక లేని విధంగా ఉండే దానయ్య లో ఇంత ఫైర్ ఉందా అని ఈ వీడియో ని చూసిన అందరూ ఆశ్చర్యపోతున్నారు.
