Udhay kiran: హీరో ఉదయ్ కిరణ్ నటించిన “నువ్వు నేను” అనే మూవీ ఇవ్వాళ రే రిలీజ్ అయిన విషయం అందరికి తెలిసిందే. అయితే మూవీలో తమ ఫేవరెట్ స్టార్ ను మళ్ళీ చూసుకుంటూ ఫ్యాన్స్ సెలబ్రేషన్ చేస్తున్నారు. ఈ మూవీని తేజనే రాసి, డైరెక్ట్ చేశారు. 2001లో రిలీజ్ అయిన ఈ మూవీ అప్పట్లో ఒక కల్ట్ స్టేటస్ పొందింది. అయితే మూవీని చూడటానికి ఉదయ్ కిరణ్ సిస్టర్ మస్కట్ ను ప్రత్యేకంగా వచ్చారు. ఈ మూవీ చూసిన తరువాత ఆమె భావోద్వేగానికి గురైయ్యారు. తన తమ్ముడు చనిపోయి ఇప్పటికి 10 సంవత్సరాలు అవుతున్నా కూడా ఇంకా అభిమానుల గుండెలా తన స్థానం పదిలంగా ఉందని, ఉదయ్ కి చావు లేదని తెలిపారు.
ఈ మూవీకి సంగీతం అందించిన ఆర్పీ పట్నాయక్ కూడా ఈ రీ రిలీజ్ కు వచ్చారు. ఉదయ్ కిరణ్ మళ్ళీ స్క్రీన్ పై చూస్తూ కంటతడి పెట్టుకున్నారు. ఉదయ్ కిరణ్ ఈ సెలెబ్రేషన్స్ చూస్తే చాల సంతోషించేవాడాని, ఉదయ్ ఎప్పుడు ప్రేక్షకుల గుండెల్లో బతికే ఉంటాడని తెలిపారు. ఇవ్వని చూడటానికి ఉదయ్ బతికుంటే బాగుందని ఆర్పీ పట్నాయక్ తెలిపారు. అయితే ఈ రీ రిలీజ్ సెలబ్రేషన్ లో మాత్రం డైరెక్టర్ తేజా కనిపించపోవడంపై ఫిలిం నగర్ చర్చకు దారితీసింది. అయితే ఉదయ్ మరణం వెనక ఉన్న అసలు నిజం తనకు తెలుసని, దాన్ని ఎదో ఒకరోజు తానూ భయటపెడుతానని తేజా ఎప్పటి నుండో చెప్తూ వస్తున్నాడు.
2001లో రిలీజ్ అయిన నువ్వు నేను మూవీకి అప్పట్లో చాల అవార్డ్స్ వచ్చాయి. బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అని ఇలా మొత్తం ఐదు విభాగాల్లో నంది అవార్డ్స్ వచ్చాయి. ఉదయ్ కిరణ్ చాలా తక్కువ టైం కెరీర్ పీక్ స్టేజికి చేరుకున్నారు. అయితే కొన్ని కారణాల తరువాత కెరీర్ చాలా స్లోడౌన్ అయ్యింది. 2014 జనవరి 5న ఉదయ్ కిరణ్ తన అపార్ట్మెంట్ లో ఆత్మహత్య చేసుకున్నారు. ఆత్మహత్యకు గల కారణాలపై ఇప్పటికి ఇండస్ట్రీలో చర్చలు జరుగుతూనే ఉన్నాయ్.