కెవ్వు కార్తిక్ పెళ్లికి రోజా ఎందుకు రాలేదో తెలుసా..

- Advertisement -

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో పెళ్లి బజాలు మోగుతున్నాయి. స్టార్స్ హీరోహీరోయిన్స్ దగ్గర్నుంచి.. ఇతర నటీనటుల వరకు ఒక్కొక్కరు వివాహబంధంలోకి అడుగుపెడుతున్నారు. ఇటీవల టాలెంటెడ్ హీరో శర్వానంద్ ఓ ఇంటివాడయ్యాడు. ఇక ఇప్పుడు జబర్దస్త్ షో ద్వారా పాపులర్ అయిన కమెడియన్ కెవ్వు కార్తీక్ పెళ్లి బంధంలోకి అడుగుపెట్టారు. కెవ్వు కార్తీక్, శ్రీలేఖల వివాహం గురువారం హైదరాబాద్‏లో ఘనంగా జరిగింది. వీరి పెళ్లి వేడుకకు బుల్లితెర నటీనటులే కాకుండా.. పలువురు సినీ ప్రముఖులు కూడా హజరయ్యారు.

కెవ్వు కార్తిక్
కెవ్వు కార్తిక్

జబర్ధస్త్ ప్రోగ్రామ్ ద్వారా తనకు అత్యంత ఆప్త మిత్రుడు అయిన గెటప్ శ్రీను సహా పలువురు కమెడియన్స్ హాజరయ్యి.. నూతన వధూవరులను ఆశీర్వదించారు. పెళ్లి ఫోటోలను సోషల్ మీడియాలో షెర్ చేశాడు గెటప్ శ్రీను. కొత్త దంపతులు జీవితాంతం సంతోషంగా ఉండాలని ఆశిస్తున్నట్లు తెలిపాడు. కెవ్వు కార్తీక్.. వరంగల్ అబ్బాయి. ఇంజనీరింగ్ పూర్తి చేసి మంచి ఉద్యోగంలో స్థిరపడిన కార్తిక్.. ఆ తర్వాత సినిమాలపై మక్కువతో ఉద్యోగం వదిలేసి సినీపరిశ్రమలోకి అడుగుపెట్టాడు. ఇప్పటికే టీవీషోలతో పలు సినిమాల్లోనూ నటించాడు.

Kevvu Karthik

అయితే జబర్దస్త్ వాళ్లలో ఎవరి పెళ్లి జరిగినా వెళ్లే రోజా కెవ్వు కార్తిక్ పెళ్లికి వెళ్లకపోవడం నెట్టింట చర్చ మొదలైంది. ఇటీవల జరిగిన రాకేష్ జోర్దార్ సుజాత పెళ్లికి కూడా ఆమె ప్రత్యేకంగా హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించింది. కెవ్వు కార్తిక్ పెళ్లికి మాత్రం రోజా రాలేక పోయింది. దీనికి కారణం ఏంటని అందరూ రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. అయితే ఆమె రాకపోవడానికి ప్రత్యేక కారణమేమి లేదు. ఆంధ్రప్రదేశ్ లో ఎలక్షన్లు దగ్గర పడుతుండడంతో రోజా రాజకీయాల్లో బిజీగా ఉంది. అందుకే ఆమె వీరి వివాహానికి హాజరుకాలేక పోయింది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here