Ritu Varma : నీ ఫస్ట్ లవ్ స్టోరీ చెప్పకుండా.. విజయ్ రష్మికను మోసం చేశావుగా.. ఆమె ఎవరో తెలుసా?

- Advertisement -

Ritu Varma : టాలీవుడ్ ఇండస్ట్రీలో రౌడీ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం ఆయన ఫ్యామిలీ స్టార్ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఆ తర్వాత విజయ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో భాగం కానున్నాడు. బ్యాక్ టు బ్యాక్ రొమాంటిక్ – ఫ్యామిలీ ఎంటర్ టైనర్ సినిమాలను చేసిన ఈ హీరో మళ్లీ అర్జున్ రెడ్డి తరహా సినిమా చేస్తే చూడాలని ఉందని అభిమానులు కోరుకుంటున్నారు.

Ritu Varma
Ritu Varma

అయితే అభిమానుల కోరిక ఎప్పుడు తీరుతుందో ఆ దేవుడికే తెలియాలి. ప్రస్తుతం విజయ్ దేవరకొండకు సంబంధించిన ఓ వార్త ఇండస్ట్రీలో వైరల్‌గా మారింది. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న కొంతకాలంగా ప్రేమించుకున్నారని.. తర్వలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారు. అయితే అప్పుడప్పుడు ఇద్దరూ ఆ విషయాలను ఖండిస్తూనే ఉన్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తల ప్రకారం, రష్మిక మందన్న కంటే ముందు విజయ్ దేవరకొండ ఒక టాప్ హీరోయిన్‌ని ప్రేమించాడన్న వార్త చర్చనీయాంశంగా మారింది. ఆమె ఎవరో కాదు రీతూ వర్మ.

- Advertisement -
Actress Ritu Varma

పెళ్లిచూపులు సినిమాతో టాలీవుడ్ కు హీరోయిన్‌గా పరిచయం అయింది. ఆమె చాలా అందంగా ఉంటుంది. కానీ హిట్ ట్రాక్ ఎక్కలేకపోయింది. వీరిద్దరి కాంబోలో పెళ్లిచూపులు సినిమా వచ్చింది. ఈ సినిమా చేస్తున్న టైంలోనే వాళ్ల మధ్య చనువు ఏర్పడిందని అది చూసి వారిద్దరూ ప్రేమలో ఉన్నారని పుకార్లు వచ్చాయి. ప్రమోషన్స్‌లో భాగంగా వారు కనిపించిన తీరు అప్పట్లో హాట్ టాపిక్‌గా మారింది.

అయితే రీతూ వర్మకు ఇప్పటికే బాయ్‌ఫ్రెండ్ ఉండడంతో విజయ్ ప్రేమను పెద్దగా పట్టించుకోలేదట. ఆశ్చర్యం ఏంటంటే.. ఎన్నో సినిమాలు చేసిన రీతూవర్మ హిట్లు అందుకోలేకపోయింది. ప్రియుడు హ్యాండ్ ఇచ్చి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుని వెళ్లిపోయాడని ప్రచారం సాగింది. ప్రస్తుతం తనదైన స్టైల్ సినిమాలో నటిస్తున్న రీతూ వర్మ మెగా ఇంటి కోడలు కాబోతుందని ప్రచారం కూడా జరిగింది. తాజాగా రీతూ వర్మ కూడా దానిపై క్లారిటీ ఇచ్చింది..!!

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here