RGV : తెలుగు వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి ఎంత చెప్పినా తక్కువే..వివాదాలకు కేరాఫ్ ఆయన.. ఎన్ని విమర్శలు వెల్లువెత్తిన వర్మ నైజం మారదు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే వర్మ ప్రతి అంశంపై తనదైన శైలిలో సెటైర్లు వేస్తుంటారు… తనకు నచ్చిన, నచ్చని వారికి ఏకీ పారెస్తుంటారు..అం దుకు వర్మ పేరు చెబితేనే చాలా మంది భయంతో ఆయన జోలికి వెళ్లరు.. అలాంటి తాజాగా తన యూట్యూబ్ ఛానల్ లో నిజం అనే కొత్త షోని ప్రారంభించారు. అబద్దం బట్టలూడదీసి నిజం చూపించడమే ఈ షో లక్ష్యం అని వర్మ తెలిపారు. ఈ షోలో భాగంగా వర్మ లెజెండ్రీ సంగీత దర్శకులు కీరవాణిని ఇంటర్వ్యూ చేశారు. ఆ ప్రోమో ప్రస్తుతం వైరల్ గా మారింది..

కీరవాణి, వర్మ కాంబినేషన్ లో క్షణ క్షణం లాంటి మ్యూజికల్ బ్లాక్ బస్టర్ వచ్చింది… ఆ సినిమా తర్వాత వచ్చిన సినిమాలు కూడా సూపర్ హిట్ ను అందుకున్నాయి..ఇంటర్వ్యూ లో భాగంగా ఆర్ఆర్ఆర్ చిత్రంలో నాటు నాటు సాంగ్ కి ఆస్కార్ దక్కడం గురించి ప్రశ్నించారు. నాటు నాటు సాంగ్ ఇంకెవరైనా మ్యూజిక్ డైరెక్టర్ చేసి ఉంటే.. దానికి ఆస్కార్ దక్కి ఉంటే.. ఆ పాటకి అంత అర్హత ఉంది అని మీరు భావించేవారా ? అని వర్మ కీరవాణిని ప్రశ్నించారు. అసలు నాటు నాటు సాంగ్ మీ కెరీర్ లో టాప్ 100 సాంగ్స్ లో అయినా ఉందా ? అని వర్మ సూటిగా ప్రశ్నించారు..

ఆ ప్రశ్నకు మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి ఎలాంటి సమాధానం ఇచ్చారో కంప్లీట్ ఇంటర్వ్యూ రిలీజ్ అయ్యాక చూడాలి. ఆర్ఆర్ఆర్ చిత్రం అనేక అంతర్జాతీయ అవార్డులు కొల్లగొట్టింది. ఈ క్రమంలో రాజమౌళి అండ్ టీం నాటు నాటు సాంగ్ కి ఉన్న క్రేజ్ చూసి ఆ పాటని వరల్డ్ వైడ్ గా ప్రమోట్ చేశారు… ఈ పాటకు మొదట ఎన్నో అవార్డు లను కూడా అందుకుంది.. ఆస్కార్ కన్నా ముందే గ్లోల్డెన్ గ్లోబ్ అవార్డును కూడా అందుకున్న విషయం తెలిసిందే..ఆస్కార్ విజేతగా కూడా నిలిచింది. లేడీ గాగా, రియానా లాంటి వరల్డ్ ఫేమస్ సింగర్స్ పాటలని పక్కకు నెట్టేసి ఈ పాట ఆస్కార్ అందుకోవడం విశేషం.. ప్రస్తుతం ఈ షో ప్రోమో నెట్టింట వైరల్ అవుతుంది..