Samantha : కమర్షియల్ గా మారిన సమంత.. కుమ్మేశావంటున్న ఫ్యాన్స్

- Advertisement -

Samantha .. ఇటీవల కాలంలే సెన్సెషన్ క్రియేట్ చేసింది. ‘ఏమాయ చేసావే’ సినిమాతో తెలుగు సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టి వరుస బ్లాక్ బస్టర్ చిత్రాలతో టాప్ హీరోయిన్ గా ఎదిగింది. తమిళంలో కూడా చక్కటి చిత్రాల్లో నటించి స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. గత కొంత కాలంగా అరుదైన వ్యాధితో బాధపడుతున్న ఆమె, తాజాగా ‘శాకుంతలం’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఘోర పరాజయం పాలైంది. అయినా సరే పట్టుదలతో తన పని తను చేసుకుంటూ పోతుంది. దక్షిణ భారత దేశంలోనే కాదు.. బాలీవుడ్ లో కూడా ఫ్యామిలీ మెన్ సీరీస్ తో సత్తా చాటింది.

Samantha
Samantha

ఒకవైపు సినిమాలు చేస్తూనే మరో వైపు కమర్షియల్ యాడ్స్ ను కూడా వరుసగా చేస్తూ ఉంది. ఇటీవల సమంత పెప్సీ కంపెనీకి బ్రాండ్‌ అంబాసిడర్ గా సైన్‌ చేసింది. తాజాగా పెప్సీ కమర్షియల్‌ యాడ్‌ తో సమంత ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సమంత షేర్ చేసిన పెప్సీ కంపెనీ కమర్షియల్ యాడ్‌ వీడియో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. 50 సెకన్లు ఉన్న ఈ కమర్షియల్‌ యాడ్‌ లో డిఫరెంట్‌ కాస్ట్యూమ్స్ లో విభిన్నమైన పాత్రల్లో సమంత కనిపించింది. సమంత లుక్ విషయంలో ఫ్యాన్స్ ఫుల్‌ హ్యాపీ ఫీల్ అయ్యే విధంగా కమర్షియల్ యాడ్‌ ఉంది అనడంలో సందేహం లేదు. సమంత హీరోయిన్ గా విభిన్నమైన పాత్రల్లో ఎలా అయితే కనిపిస్తుందో యాడ్ లో కూడా చాలా ఎనర్జిటిక్ గా విభిన్నమైన గెటప్స్ లో కనిపించింది అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటి వరకు సమంత చాలా కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించింది.

Samantha  AD

పెళ్లి కూతురు గెటప్ నుంచి యాక్షన్ హీరోయిన్ లుక్ వరకు సమంత కనిపించడం విశేషం. గతంలో మెగాస్టార్ చిరంజీవి, మహేష్ బాబు లాంటి సౌత్ హీరోస్ ఈ బ్రాండ్ ప్రమోట్ చేశారు. అయితే మొదటి సారి బాలీవుడ్ స్టార్స్ తో పాటు సౌత్ స్టార్స్ బ్రాండ్‌ అంబాసిడర్ లుగా వ్యవహరించిన పెప్సీ కంపెనీ బ్రాండ్ అంబాసిడర్ గా సామ్ అవకాశం దక్కించుకుంది. ఇందుకు గాను సమంత భారీ మొత్తంలో పారితోషికంను అందుకుంటుంది.

- Advertisement -

రాబోయే సంవత్సర కాలం పాటు ఆమె పెప్సీ ప్రచార బాధ్యతను నిర్వహించబోతుంది. ప్రస్తుతం సమంత.. డైరెక్టర్ శివ నిర్వాణ తెరకెక్కిస్తోన్న ఖుషి చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. అలాగే సిటాడెల్ వెబ్ సిరీస్ లో బాలీవుడ్ స్టార్ వరుణ్ ధావన్ తో కలిసి నటిస్తున్నారు. గత కొద్ది రోజులుగా ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here