RGV పిచ్చి పరాకాష్టకు చేరింది.. ఒక్క పాటతో నెట్టింట దుమారం.. వీడియో..

- Advertisement -

RGV : తెలుగు వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏం చేసిన సంచలనమే.. ఆయన లాగా ఆలోచించడం చాలా కష్టం.. ఎటువంటి సందర్భం అయినా కూడా వర్మ కొత్త గా చేస్తాడు.. కొన్ని సార్లు ప్రశంసలు అందుకుంటే.. మరికొన్ని సార్లు విమర్శలు అందుకోవడం మనం చూస్తూనే ఉన్నాం.. తాజాగా మరో వీడియో తో నెట్టింట దుమారం రేపుతున్నాడు.. పుట్టినరోజు నాడు నేడు చావు రోజూ అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చాడు.. అది ఓ రేంజులో వైరల్ అవుతుంది.. ఆ పాట గురించి పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం..

rgv birthday
rgv birthday

అందరిపైనా సినిమాలను తెరకెక్కిస్తూ ప్రజల్లో హాట్ చర్చలకు దారి తీస్తున్నాడు.. ఇటీవల ఆయన తెరకెక్కించిన అమ్మారాజ్యంలో కడప బిడ్డలు అనే సినిమా ఎంత రచ్చ చేసిందో తెలిసిందే.. అయితే ప్రస్తుతం ఆయన పవన్ కళ్యాణ్ మీద సినిమా తీస్తున్నాడు.అలాంటి రామ్ గోపాల్ వర్మ కు వ్యతిరేకంగా ఇప్పుడు చాలా మంది సినిమాలను తీస్తున్నారు.. ఎపుడూ వివాదాలతో జీవించే ఆర్జీవి ప్రస్తుతం రాజకీయాల మీద పడ్డారు. అందునా ఏపీ రాజకీయాల మీద స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తూ టీడీపీ జనసేన పార్టీల మీద విమర్శలను గుప్పిస్తున్నారు..

ఇక ఇటీవల హైదరాబాద్ లో వీధికుక్కల దాడిలో నాలుగేళ్ళ చిన్నారి చనిపోతే ఆ సంఘటన ఎవరూ పట్టించుకోలేదు. అయితే ఆర్జీవి మాత్రం ఆ ఇష్యూ మీద తన స్టైల్ లో ట్వీట్ చేసి దట్ ఈజ్ ఆర్జీవి అనిపించుకున్నాడు.. ఒక చిన్నారిని కుక్కలు లాక్కెళ్లడం అది కూడా నగరం మధ్యలో సంఘటన జరిగింది. కానీ ఏ ఒక్క సినిమా సెలబ్రిటీ కానీ ప్రముఖులు కానీ స్పందించలేదు. స్పందిస్తే ఏమవుతుందో అన్నట్లుగా చూసి చూడనట్లు ప్రవర్తించారు.. అంటూ మండిపడ్డారు.. ఓ పాటను కూడా పాడారు.. ఇప్పుడు తన పుట్టినరోజు సందర్భంగా ఎవరు విష్ చెయ్యొద్దని అంటూ ట్యాగ్ చేస్తూ ఆర్జీవీ అంతు చిక్కని విచిత్ర జీవి..తిక్క ఉంది కానీ అందులో లాజిక్ ఉంది చూడు అంటూ పాట లిరిక్స్ ఉంటున్నాయి. ఈ పాట ప్రస్తుతం నెట్టింట ట్రేండ్ అవుతుంది..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here