చివరి శ్వాస వరకు పవన్ కళ్యాణ్ తోనే అంటూ రేణు దేశాయ్ షాకింగ్ కామెంట్స్..వైరల్ అవుతున్న వీడియో!

- Advertisement -

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు రేణు దేశాయ్ విడాకులు తీసుకొని చాలా కాలం అయిన సంగతి మన అందరికి తెలిసిందే. విడాకులు తీసుకున్న తర్వాత పవన్ కళ్యాణ్ అన్న లెజినావా ని పెళ్లాడాడు. రేణు దేశాయ్ కూడా రెండవ పెళ్ళికి సిద్ధమైంది కానీ, ఎందుకో ఆ తర్వాత దాని ఊసే ఎత్తలేదు. పవన్ కళ్యాణ్ తో విడిపోయినప్పటికీ రేణు దేశాయ్ ఎంతో మంచి స్నేహం గానే ఉంటుంది. విడాకులు తర్వాత కూడా పవన్ కళ్యాణ్ అనేక సార్లు పిల్లల కోసం పూణే కి వెళ్ళాడు.

రేణు దేశాయ్
రేణు దేశాయ్

రేణు దేశాయ్ ని కూడా ఎన్నోసార్లు కలిసాడు. రేణు దేశాయ్ సోషల్ మీడియా లో ఎప్పుడూ యాక్టీవ్ గా ఉండే సంగతి అందరికీ తెలిసిందే. కొన్ని కొన్ని సార్లు ఆమె అభిమానులతో ఇంటరాక్ట్ అవుతూ ఉంటుంది. అప్పుడప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పై కోపగించుకుంటుంది కూడా. అయితే ఈరోజు ఆమె విడుదల చేసిన ఒక వీడియో సోషల్ మీడియా లో తెగ వైరల్ గా మారింది.

ఆమె మాట్లాడుతూ ‘నేను ప్రస్తుతం నా మాజీ భర్త పవన్ కళ్యాణ్ తో దూరంగా ఉంటున్నప్పటికీ, ఎన్నో ఏళ్ళు కాపురం చేసిన అనుభవం తో చెప్తున్నాను, ఆయన చాలా మంచి మనిషి, డబ్బు మనిషి అసలే కాదు. ఎల్లప్పుడూ ప్రజల కోసం తాపత్రయం పడుతూ ఉంటాడు. ఇదే నేను ఆయనలో నేను గమనించిన విషయం. ఒక రాజకీయ నాయకుడిగా పవన్ కళ్యాణ్ గారికే నా సపోర్టు ఎల్లపుడూ ఉంటుంది. ఆయన గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

- Advertisement -

ఆయన వల్ల నేను హర్ట్ అయ్యాను కానీ, వ్యక్తిగా ఆయనని ఇప్పటికీ నేను ఎంతగానో అభిమానిస్తున్నాను’ అంటూ చెప్పుకొచ్చింది రేణు దేశాయ్. ఆమె మాట్లాడిన ఈ మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. ప్రత్యర్థులకు మూడు పెళ్లిళ్ల మీద కామెంట్ చేసే అవకాశం లేకుండా చేసింది, ఇకనైనా ప్రత్యర్థులు పవన్ కళ్యాణ్ పై ఈ విషయం మీద విమర్శలు చెయ్యడం ఆపుతారో లేదో చూడాలి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here