రేణూ దేశాయ్..పవన్ కల్యాణ్ మాజీ భార్య ఆయన ఈమె ఏం మాట్లాడినా సోషల్ మీడియాలో ఒక సంచలనమే అవుతుంది. నేటిజన్స్ కూడా చాలా వరకు ప్రతి చిన్న విషయానికి ఆమెను కామెంట్ చేస్తూ ట్రోల్ చేయడం బాగా కామన్ అయింది. పవన్ కళ్యాణ్ తో విడిపోయి చాలా కాలం అవుతున్న ఇప్పటికీ రేణు దేశాయ్ ఏదో ఒక విషయంలో పవన్ తో ముడిపడే ఉంది.
అప్పుడప్పుడు ఆమె పవన్ ను ఉద్దేశించి చేసే కొన్ని కామెంట్స్ వివాదాలకు దారి తీస్తున్నాయి. పవన్ విడాకులు తీసుకుంటున్నందుకు భార్యగా ఆమెకు చేయవలసిన న్యాయం చేసినప్పటికీ.. చట్టబద్ధంగా విడిపోయిన తర్వాత కూడా రేణు దేశాయ్ కావాలని పవన్ ని టార్గెట్ చేసి మాట్లాడుతుందని అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
అంతేకాదు పవన్ కళ్యాణ్ కి వ్యతిరేకంగా ఆమె చేస్తున్న కామెంట్స్ ఎవరో కావాలని చేయిస్తున్నారనదే వాళ్ల ఆరోపణ. ఈ విషయంలో గత కొద్దికాలం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు రేణు దేశాయ్ మధ్యలో మీడియా వార్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో మొట్టమొదటిసారిగా రేణు దేశాయ్ పవన్ కళ్యాణ్ గురించి పాజిటివ్ గా మాట్లాడడం జరిగింది. పవన్ నా విషయంలో తప్పు చేశాడేమో.. కానీ అతను సామాజిక స్పృహ ఉన్న వ్యక్తి.. డబ్బుపై వ్యామోహం కూడా లేదు అని రేణు దేశాయ్ స్టేట్మెంట్ ఇచ్చింది.
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పవన్ కళ్యాణ్ ఆంటీ ఫ్యాన్స్ ప్రస్తుతం రేణు దేశాయ్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ప్రస్తుతం వీళ్ళు రేణుదేశాన్ని టార్గెట్ చేసి సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. ఎవరో డబ్బులు ఇచ్చి కావాలని రేణు దేశాయ్ దగ్గర ఇలా చేయించారని కామెంట్స్ పెడుతున్నారు. దీంతో రేణు దేశాయ్ నేను ఎప్పుడూ నిజమే మాట్లాడాను కానీ అప్పుడేమో వాళ్ళు అలా తిట్టారు ఇప్పుడేమో వీలు ఇలా తిట్టడం స్టార్ట్ చేశారు అని సుదీర్ఘ సందేశం రాసి పోస్ట్ చేశారు.