కీర్తి సురేష్ సిస్టర్ సెంటిమెంట్ ఈ రెండు సినిమాలను దెబ్బ కొట్టిందా…

- Advertisement -

మహానటి చిత్రంతో బాగా పాపులర్ అయిన కీర్తి సురేష్ నటించినవి కొన్ని చిత్రాలే అయినప్పటికీ మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఈమె కెరియర్ లో చేసిన చిత్రాలతో పోల్చుకుంటే సక్సెస్ఫుల్ చిత్రాల రేట్ తక్కువనే చెప్పచ్చు. రీసెంట్గా కీర్తి సురేష్ హీరోయిన్ గా కాకుండా సిస్టర్ క్యారెక్టర్ లో నటించిన చిత్రాలు రెండు. ఒకటి సూపర్ స్టార్ రజినీకాంత్ పెద్దన్న, రెండవది మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్.

కీర్తి సురేష్
కీర్తి సురేష్

భారీ ఎక్స్పెక్టేషన్స్ తో విడుదలైన ఈ రెండు చిత్రాలు బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా పడ్డాయి. ఈ రెండిట్లో కామన్ పాయింట్ ఏంటంటే…కీర్తి సురేష్ ఇద్దరు హీరోలకి సిస్టర్ గా నటించడం. రజినీకాంత్ హీరోగా నటించిన పెద్దన్న విషయానికి వస్తే.. మూవీలో గొప్ప ఎమోషనల్ కంటెంట్ ఉన్నప్పటికీ సినిమా రిలీజ్ అయ్యాక కథ రొటీన్ అన్న టాక్ వచ్చింది. దీంతో మూవీ ఊహించిన విధంగా సక్సెస్ అందుకోలేకపోయింది.

ఇక మెగాస్టార్ భోళా శంకర్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.. ట్రైలర్ ,టీజర్ ,ఫస్ట్ సింగిల్ ఇలా ప్రతి దానికి హడావిడి చేశారు. వాల్తేరు వీరయ్య సక్సెస్ తర్వాత వస్తున్న చిత్రం కావడంతో మెగాస్టార్ ఫ్యాన్స్ ఈ మూవీ మంచి ఫీస్ట్ లాగా ఉంటుంది అని భావించారు.భోళా శంకర్ చిత్రం కూడా ఇంచుమించు పెద్దన్న టైప్ కాన్సెప్ట్ తోనే సాగే చిత్రం అని తేలిపోయింది.

- Advertisement -

సోషల్ మీడియాలో ప్రస్తుతం భోళాశంకర్ మూవీ కంటే కూడా దాని డైరెక్టర్ మెహర్ రమేష్ గురించి ఎక్కువ ట్రోలింగ్ జరుగుతోంది. చిరు లాంటి హీరోతో మంచి చిత్రం తీసి ఐరన్ లెగ్ డైరెక్టర్ గా ఉన్న తన గుర్తింపును మార్చుకుంటాడు అనుకుంటే అది కూడా చేతకాక సినిమాని మొత్తం చెడిపేసాడు అని ఫ్యాన్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క కీర్తి సురేష్ సిస్టర్ గా మూవీ లో వర్కౌట్ అవ్వదు అని కొందరు అభిప్రాయపడుతున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here