Renu Desai మోడలింగ్ రంగం లో గొప్పగా రాణించి ఆ తర్వాత పూరి జగన్నాథ్ మరియు పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో తెరకెక్కిన బద్రి సినిమా ద్వారా ఇండస్ట్రీ కి హీరోయిన్ గా పరిచయమైనా రేణు దేశాయ్ ఆ తర్వాత పవన్ కళ్యాణ్ తో ప్రేమలోపడి కొంతకాలం డేటింగ్ చేసిన తర్వాత పెళ్లి చేసుకోవడం,కొన్నేళ్ల తర్వాత వీళ్లిద్దరి మధ్య కొన్నివిభేదాలు వచ్చి విడిపోవడం వంటివి జరిగింది సంగతి తెల్సిందే.

అయితే పవన్ కళ్యాణ్ తో విడిపోయిన తర్వాత పూణే కి వెళ్లిన రేణు దేశాయ్ అక్కడ ఒక ప్రముఖ NRI తో ప్రేమలో ఉన్నట్టు త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నామని ప్రకటించి , నిశ్చితార్థం కూడా జరుపుకుంది.కానీ ఆ పెళ్లి సంగతి ఏమైందో ఇప్పటి వరకు క్లారిటీ లేదు.ఇది ఇలా ఉండగా రీసెంట్ గా ఆమె రవితేజ హీరో గా నటిస్తున్న ‘టైగర్ నాగేశ్వరరావు’ సినిమా ద్వారా ఇండస్ట్రీ లోకి రీ ఎంట్రీ ఇచ్చింది.

ఇప్పుడు ఆమె కెరీర్ పరంగా బాగా బిజీ అవుతుందని అనుకునేలోపు రీసెంట్ గా ఆమె పెట్టిన ఒక ఇంస్టాగ్రామ్ పోస్ట్ సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.తాను ప్రస్తుతం తీవ్రమైన అనారోగ్య సమస్య తో బాధపడుతున్నాని, చికిత్స తీసుకుంటున్నాను, త్వరలోనే మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతాను అంటూ పెట్టిన ఒక ఎమోషనల్ పోస్ట్ సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

ఎప్పుడైతే ఆమె ఈ పోస్ట్ పెట్టిందో అప్పటి నుండి కామెంట్స్ లో మీరు తొందరగా కోలుకోవాలి అంటూ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మరియు రేణు దేశాయ్ ని అభిమానించే వాళ్ళు కామెంట్స్ చేస్తున్నారు.పవన్ కళ్యాణ్ తో విడిపోయిన తర్వాత కూడా అభిమానులు ఆమెని వదినగానే భావిస్తారు, ఆమె గురించి ఎప్పుడు మంచిగానే కోరుకుంటూ ఉంటారు.బహుశా ఇలా ఎక్కడా కూడా ఉండదేమో, రేణు దేశాయ్ తొందరగా కోలుకొని ఆమె తన షూటింగ్స్ లో జాయిన్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుందాము.
