Regina Cassandra: ఈ చెన్నై చిన్నదాని గురించి టాలీవుడ్ ప్రేక్షకులకు కొత్తగా చెప్పనక్కర్లేదు. టాలీవుడ్ శివ మనసులో శ్రుతి అంటూ ఎస్ఎంఎస్ సినిమాతో అరంగేట్రం చేసింది. ఆ సినిమాలో ఈ బ్యూటీ అందానికి కుర్రాళ్లు ఫిదా అయ్యారు. ఈ భామ నటనకు కూడా మంచి మార్కులే పడ్డాయి. ఇక ఆ తర్వాత వచ్చి రొటీన్ లవ్ స్టోరీతో తెలుగు కుర్రాళ్లు ఈ చెన్నై చిన్నాదానితో ప్రేమలో పడిపోయారు.

రొటీన్ లవ్ స్టోరీ మూవీ సూపర్ హిట్ టాక్ సంపాదించుకుంది. ఈ చిత్రంలో సందీప్ కిషన్ హీరోగా నటించాడు. ఈ సినిమా తర్వాత రెజీనాకు వరుస అవకాశాలు వచ్చాయి. పవర్, కొత్తజంట, రారా కృష్ణయ్య, సుబ్రమణ్యం ఫర్ సేల్, పిల్లా నువ్వులేని జీవితం, సెవెన్, జ్యో అచ్యుతానంద, నక్షత్రం, ఎవరు, సౌఖ్యం, ఆ!, ఇటీవల వచ్చిన మిడ్ నైట్ రన్నర్స్. ఇలా వరుస సినిమాలతో బిజీ అయిపోయింది.

ఓవైపు తెలుగులో బిజీగా ఉంటూనే మరోవైపు తమిళ, కన్నడ ఇండస్ట్రీలో అవకాశాలు దక్కించుకుంది. అక్కడ కూడా వరుస సినిమాలు చేస్తూ బిజీ అయింది. అంతటితో ఆగకుండా ఈ భామ బాలీవుడ్‌కు వెళ్లింది. బీ టౌన్లో ఏక్ లడ్ కీ కో దేఖాతో ఐసా లగా అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ఇటీవల ఫర్జీ వెబ్ సిరీస్‌తో మరోసారి అలరించింది. అంతకుముందు శూర్వీర్ అనే వెబ్‌సిరీస్‌లో నటించింది.

ఇలా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటూనే ఈ భామ సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్‌గా ఉంటుంది. తనకు సంబంధించిన ఫొటోలు షేర్ చేస్తూ అభిమానులను ఖుష్ చేస్తూ ఉంటుంది. తాజాగా ఈ బ్యూటీ పింక్ కలర్ డ్రెస్‌లో చాలా ట్రెడిషన్ల్ లుక్‌లో దర్శనమిచ్చింది. ఈ ఫొటోలు తన సోషల్ మీడియా ఖాతాల్లో పోస్టు చేసింది. క్షణాల్లోనే ఈ ఫొటోలు వైరల్ అయ్యాయి.

పింక్ కలర్ డ్రెస్‌లో రెజీనా చాలా అందంగా కనిపించింది. ఎత్నిక్ వేర్‌లోనూ ఈ బ్యూటీ ముద్దుగా ఉంది. చెవులకు జుంకాలు పెట్టుకుని కవ్వించే పోజులతో కుర్రాళ్లకు కైపెక్కించింది. ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. రెజీ.. యూ ఆర్ సో క్యూట్ అంటూ కుర్రాళ్లు తెగ కామెంట్లు పెట్టేస్తున్నారు.