Ravi Krishna : కొంతమంది హీరోలు చేసింది అతి తక్కువ సినిమాలే అయినా, చరిత్రలో ఎప్పటికీ మర్చిపోలేని పాత్రలు పోషించి ఉంటారు. పెద్ద స్టార్స్ అయ్యేందుకు అన్నీ రకాల అర్హతలు ఉన్నప్పటికీ కూడా ఎందుకో సినిమాలకు దూరం అవుతూ ఉంటారు. అలాంటి హీరోలలో ఒకడు రవి కృష్ణ. ఈయన ప్రముఖ స్టార్ నిర్మాత ఏ ఏం రత్నం కొడుకు. ‘7G బృందావన కాలనీ’ చిత్రం తో ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ఈయన, ఆ సినిమా అతి పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం తో యూత్ లో మంచి క్రేజ్ ని సంపాదించుకున్నాడు.

అతను నటన, డైలాగ్ డెలివరీ వగైరా వంటివి చాలా డిఫరెంట్ గా ఉండడం తో తొలిసినిమాతోనే ఆ రేంజ్ క్రేజ్ ని సంపాదించుకున్నాడు. ఈ చిత్రం తర్వాత ఆయన ‘ముద్దుల కొడుకు’, ‘నిన్న నేడు రేపు’, ‘బ్రహ్మానందం డ్రామా కంపెనీ’ వంటి తెలుగు సినిమాల్లో నటించాడు, తమిళం లో కూడా పలు సినిమాల్లో హీరో గా నటించాడు కానీ, సక్సెస్ లు పెద్దగా రాలేదు.

తెలుగు లో సూపర్ హిట్ గా నిల్చిన ‘గమ్యం’ చిత్రంని తమిళంలో రీమేక్ చెయ్యగా, అందులో అల్లరి నరేష్ పాత్రని రవి కృష్ణ చేసాడు. ఈ పాత్రకి మంచి పేరు వచ్చింది, ఇక ఆ తర్వాత ఈయన పెద్దగా సినిమాల్లో నటించలేదు. రీసెంట్ గా ఆయన హీరో గా నటించిన ‘7G బృందావని కాలనీ’ చిత్రాన్ని 4K టెక్నాలజీ కి మార్చి విడుదల చేసారు. రెస్పాన్స్ అదిరిపోయింది. రీ రిలీజ్ లో కూడా దాదాపుగా మూడు కోట్ల రూపాయిల గ్రాస్ ని వసూలు చేసింది.

రీ రిలీజ్ కి ముందు రవికృష్ణ ఇచ్చిన ఇంటర్వ్యూస్ లో 19 ఏళ్ళు ఆయన స్పీనేమాలకు దూరం అవ్వడానికి గల కారణం చెప్పాడు. 19 ఏళ్ళు నేను కావాలని సినిమాలకు దూరం కాలేదని, సరైన స్క్రిప్ట్స్ దొరకకపోవడం వల్లే సినిమాలు చెయ్యలేదని, ఎన్నో వందల స్క్రిప్ట్స్ విన్నాను కానీ ఒక్కటి కూడా నచ్చలేదు అంటూ చెప్పుకొచ్చాడు. ఇప్పుడు త్వరలోనే ‘7G బృందావన కాలనీ’ సీక్వెల్ లో నటించబోతున్నాను అని, వచ్చే నెలలోనే షూటింగ్ ప్రారంభం అవుతుందని చెప్పుకొచ్చాడు.