Kajal Aggarwal : ఇప్పుడు ఉన్న కొంతమంది స్టార్ హీరోయిన్స్ ఇండస్ట్రీ కి వచ్చిన కొత్తల్లో చిన్న చిన్న పాత్రలు పోషిస్తూ వచ్చిన వాళ్ళే. త్రిష, రకుల్, రెజీనా ఇలా ఎంతోమంది ఉన్నారు. వీళ్ళతో పాటు కాజల్ అగర్వాల్ కూడా ఉందని ఈరోజే తెలిసింది. నిన్న మొన్నటి వరకు కాజల్ అగర్వాల్ మొదటి సినిమా ‘లక్ష్మీ కళ్యాణం ‘. ఆ తర్వాత ‘చందమామ’ , ‘మగధీర’ వంటి సినిమాలు వచ్చాయని అనుకుంటూ ఉన్నాం.
కానీ అంతకు ముందే ఆమె పలు సినిమాల్లో గ్రూప్ డ్యాన్సర్లు లో ఒకటిగా నటించింది అనే విషయం చాలా మందికి తెలియదు. అప్పట్లో యూత్ ని ఒక ఊపు ఊపిన ‘7/G బృందావన కాలనీ’ సినిమాని అందరూ చూసే ఉంటారు. ఈ చిత్రం నిన్న తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్ గా రీ రిలీజ్ అయ్యి బంపర్ ఓపెనింగ్స్ ని దక్కించుకుంది. కేవలం తెలుగు రాష్ట్రాల నుండే ఈ సినిమా కోటి రూపాయలకు పైగా గ్రాస్ ని వసూలు చేసిందట.
ఇదంతా పక్కన పెడితే ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ ఉన్నట్టు నిన్న ఈ చిత్రానికి వెళ్లిన వాళ్ళు వెండితెర మీద చూసి కనిపెట్టారు. ఈ చిత్రం లోని ‘మేము వయస్సుకు వచ్చాం’ సాంగ్ ఎంత పాపులర్ అయ్యిందో మన అందరికీ తెలిసిందే. ఈ సాంగ్ లో గ్రూప్ డ్యాన్సర్స్ లో ఒకరిగా కాజల్ అగర్వాల్ కనిపించింది. నీలి రంగు బట్టలతో నలుగురిలో ఒకరిగా ఆమె డ్యాన్స్ వెయ్యడం మనమంతా గమనించొచ్చు.
మనం గమనించింది ఈ ఒక్క సినిమాలోనే. కాజల్ అగర్వాల్ అలా గతం లో ఇంకెన్ని సినిమాలు చేసిందో అని అనుకుంటున్నారు నెటిజెన్స్. ఆ స్థాయి నుండి నేడు సౌత్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ ని నెంబర్ 1 హీరోయిన్ గా ఏలే రేంజ్ కి వెళ్ళింది అంటే ఆమె కష్టం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు అని పొగడ్తలతో ముంచి ఎత్తుతున్నారు ఫ్యాన్స్.
Kajal Agarwal in #7GBrundavanColony pic.twitter.com/h8r6sDcNMx
— SiD (@wakeupsiduu) September 23, 2023