ప్రస్తుతానికి తెలుగులో మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ ఎవరు అంటే మనకు ముందుగా వినిపించే పేరు హీరో ప్రభాస్. నాలుగు పదులు దాటిన ఈ హీరో ఇంకా పెళ్లి చేసుకోకపోవడం అభిమానులను కొంచెం కలవరపెడుతోంది.ప్రభాస్ అంతటి ఏజ్ ఉన్న తెలుగు హీరోలు అందరికీ పెళ్లి అయిపోయింది. అంతేకాదు ప్రభాస్ కన్నా చిన్నవారు అయినా రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, నితిన్, నిఖిల్ ఇలా దాదాపు మన తెలుగు హీరోలు అందరూ పెళ్లి చేసుకొని ఒక ఇంటి వారు అయిపోయారు. వీరిలో చాలామందికి వారసులు కూడా వచ్చేసారు. కానీ పాన్ ఇండియా లెవల్లో, అందరికన్నా కూడా ఒక మెట్టు పై స్థానంలో క్రేజ్ తెచ్చుకున్న ప్రభాస్ మాత్రం ఇంకా పెళ్లి చేసుకోలేదు.

ప్రభాస్ పెళ్లి విషయం ఎప్పుడు హాట్ టాపిక్ అవుతూనే ఉంటుంది. ప్రభాస్‌తో అనుష్క ప్రేమలో ఉందంటూ గతంలో ఎన్నో రకాల వార్తలు వచ్చాయి. సీక్రేట్‌గా చెట్టాపట్టాలేసుకుని తిరిగారని, పెళ్ళి చేసుకోవాలనుకున్నారని, పెళ్ళి తరువాత ఉండటానికి అమెరికాలో ఇల్లు కూడా కట్టుకున్నారన్న వార్తలు సోషల్ మీడియాలో గుప్పుమన్నాయి. చాలా ఏళ్లుగా వస్తున్న ఈ వార్తలపై స్టార్ హీరో ప్రభాస్ కాని.. హీరోయిన్ అనుష్క కాని ఖండించలేదు..కనీస స్పందన కూడా ఇవ్వలేదు. దాంతో ఈ విషయంలో ఎంతో కొంత నిజం ఉంది అని అనుకుంటున్నారు నెటిజన్లు.

అయితే ప్రభాస్ ఇన్నాళ్లు పెళ్లికి దూరంగా ఉండడం వెనక ఓ బలమైన కారణం ఉందట. అది ఏంటంటే.. అసలు ప్రభాస్ జాతకంలో కళ్యాణ యోగమే లేదట. ఒకవేళ పెళ్లి చేసుకున్న సరే ఆ బంధం ఎక్కువ రోజులు నిలవదని ప్రభాస్ కుటుంబానికి సన్నిహితంగా ఉండే జ్యోతిష్యులు చెప్పారట. అందుకే ప్రభాస్ పెళ్లి(Prabhas Marriage)కి దూరంగా ఉంటున్నాడని ప్రచారం జరుగుతోంది. దీంతో నిజంగా ప్రభాజ్ జాతకంలో అంత పెద్ద సమస్య ఉందా అంటూ అభిమానులు, నెటిజన్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.