Big Boss : అతి తక్కువ ఓట్లు వచ్చిన వారికే బిగ్ బాస్ హౌస్ లో రీ ఎంట్రీ..ఇది మామూలు ట్విస్ట్ కాదుగా!

- Advertisement -

Big Boss : ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ ఊహించని ట్విస్టులతో, ఆడియన్స్ కి మరియు హౌస్ మేట్స్ కి దిమ్మ తిరిగే ట్విస్టులతో ముందుకు దూసుకుపోతున్న సంగతి మన అందరికీ తెలిసిందే. ఇంతకు ముందు ఏ సీజన్ లో లేని విధంగా ఈ సీజన్ లో కొన్ని సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఇంహకు ముందు వైల్డ్ కార్డు ఎంట్రీలు ఉండేవి, కానీ ఈ సీజన్ లో ఒకేసారి 5 మంది కొత్త కంటెస్టెంట్స్ లోపలకు అడుగుపెట్టారు.

Big Boss
Big Boss

ఇంతకు ముందు ఎలిమినేట్ అయిన పాత కంటెస్టెంట్స్ ప్రేక్షకుల ఓటింగ్ ద్వారా లోపలకు అడుగుపెట్టారు. బిగ్ బాస్ సీజన్ 2 లో అలా జరిగింది. కానీ ఈసారి మాత్రం ఇంటి సభ్యుల ఓటింగ్ ద్వారా మాత్రమే ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ లో ఒకరు మళ్ళీ హౌస్ లోకి అడుగుపెట్టబోతున్నారు. బిగ్ బాస్ హౌస్ లో కనీసం మూడు నుండి నాలుగు వారాలు హౌస్ లో కొనసాగిన ముగ్గురిలో ఒకరికి ఆ ఛాన్స్ దక్కనుంది.

ఆ ముగ్గురు ఎవరంటే రతికా, శుభ శ్రీ మరియు దామిని. ఈ ముగ్గురు కూడా నిన్న హౌస్ లోకి అడుగుపెట్టి హౌస్ మేట్స్ ని తమకి ఒక్క అవకాశం ఇవ్వాల్సిందిగా ఓటుని అప్పీల్ చేసుకున్నారు. వీరిలో ఎవరికీ ఎక్కువ ఓట్లు వస్తాయో వాళ్ళు హౌస్ లోకి అడుగుపెట్టబోతున్నారు అనుకుంటే మీ పొరపాటే. వీరిలో అందరి కంటే అతి తక్కువ ఓట్లు నమోదు అయిన కంటెస్టెంట్ ని మాత్రమే లోపలకు పంపబోతున్నారు అట.

- Advertisement -

ఆ కంటెస్టెంట్ ఎవరు ఏమిటి అనేది రేపటి వరకు సస్పెన్స్. అయితే ఈ ముగ్గురిలో దామిని మరియు శుభ శ్రీ కి మంచి హౌస్ లో మంచి స్నేహితులు ఉన్నారు. కేవలం రతికా మాత్రమే అందరికి విలన్ లాగ అనిపిస్తాది. కాబట్టి అందరికంటే ఆమెకే తక్కువ ఓట్లు వస్తాయని, ఆమెనే బిగ్ బాస్ హౌస్ లోకి మళ్ళీ రీ ఎంట్రీ ఇస్తుందని అంటున్నారు. మరి ఇందులో ఎంత మాత్రం నిజం ఉందో తెలియాలంటే రేపటి వరకు ఆగాల్సిందే.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here