Ravi Teja : వచ్చే దసరా సీజన్లో బడా సినిమాలన్నీ క్యాష్ చేసుకోవడానికి లైన్లో ఉన్నాయి. వాటిలో రవితేజ నటించిన మోస్ట్ అవైటెడ్ మూవీ ‘టైగర్ నాగేశ్వర రావు’ ఒకటి. ఈ సినిమాలో నుపుర్ సనన్, గాయత్రీ భరద్వాజ్ హీరోయిన్లుగా నటించారు. వారితో పాటు మురళి శర్మ, జిష్షు సేన్ గుప్త, అనుపమ్ ఖేర్ కీలక పాత్రలను పోషించారు. ఇటీవల రిలీజైన ట్రైలర్ కు మంచి స్పందన వచ్చింది. ఈ సినిమాలో రవితేజ 70స్ ల కాలంలో పేరు మోసిన గజదొంగ టైగర్ నాగేశ్వర రావు పాత్ర పోషిస్తున్నాడన్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవల్లో ఈ సినిమా తెరకెక్కింది. అక్టోబర్ 20న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ, హిందీలో కూడా రిలీజ్ అవుతుంది. ఇది కామన్ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ఈ సినిమాను ఇప్పటి వరకు తెలుగు ఇండస్ట్రీలో ఏ సినిమా విడుదల చేయని భాషలో రిలీజ్ చేస్తున్నట్టు మేకర్స్ తెలిపారు. అదే “సైన్ లాంగ్వేజ్”. ఇదేదో అర్ధం కానీ భాష అని అనుకోవచ్చు.. అదేం కాదు. సైన్ లాంగ్వేజ్ అంటే సైగలతో మాత్రమే కమ్యూనికేట్ చేయడానికి ఉపయోగించే భాష.

అంటే కొందరు చెవిటి, మూగ వారిని కమ్యూనికేట్ చేసే భాష ఇది. ఈ లోపంతో ఉన్న వారు ప్రపంచంలో చాలా మందే ఉన్నారు. అయితే వీరికి కూడా అర్ధమయ్యే విధంగా సైన్ లాంగ్వేజ్ లో సినిమా రిలీజ్ చేస్తున్నారు.. సైన్ లాంగ్వేజ్ లో కూడా ట్రైలర్ రిలీజ్ చేయగా, దానికి కూడా మంచి ఆదరణే లభించింది. ఇక సైన్ లాంగ్వేజ్ లో రిలీజ్ చేస్తున్న ఫస్ట్ కమర్షియల్ మూవీ ఇదే.. గతంలో కొన్ని డాక్యుమెంటరీ సినిమాలను వారికోసం ప్రదర్శించేవారు. ప్రస్తుతం ఈ సినిమాతో కమర్షియల్ కూడా విడుదల చేసేందుకు శ్రీకారం చుట్టారు. మొదటి సినిమా టైగర్ నాగేశ్వరరావు కావడంతో ఈ సినిమాపై మరింత పాజిటివిటీ పెరిగిందని చెప్పొచ్చు.
