Bhagwant Kesari : ‘భగవంత్ కేసరి’ మొట్టమొదటి రివ్యూ..బాలయ్య ని ఇలా కూడా చూడొచ్చా..!

- Advertisement -

Bhagwant Kesari : బాలయ్య బాబు కెరీర్ లో ఎన్నడూ లేనంత జోష్ తో ఉన్నాడు. ఆయన హీరో గా నటించిన ‘అఖండ’ మరియు ‘వీర సింహా రెడ్డి’ చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాలుగా నమోదైన సంగతి అందరికీ తెలిసిందే. కుర్ర హీరోలతో సమానంగా డ్యాన్స్ మరియు ఫైట్స్ చేస్తూ, అసలు ఎనర్జీ కి పర్యాయపదం లాగ ఉంటాడు బాలయ్య. ప్రస్తుతం ఆయన అనిల్ రావిపూడి తో ‘భగవంత్ కేసరి’ అనే చిత్రం చేస్తున్నాడు.

Bhagwant Kesari
Bhagwant Kesari

ఈ సినిమా ఈ నెల 20 వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల కాబోతుంది. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన టీజర్ కి ఫ్యాన్స్ మరియు ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. కచ్చితంగా ఈ సినిమా తో బాలయ్య హ్యాట్రిక్ హిట్ కొడుతాడు అనే నమ్మకం అందరిలో కలిగింది. రీ రికార్డింగ్ కార్యక్రమాలను రీసెంట్ గానే పూర్తి చేసుకున్న ఈ సినిమా ఫైనల్ ఔట్పుట్ ని ప్రసాద్ ల్యాబ్స్ లో కొంత మంది మీడియా మిత్రులు మరియు పాత్రికేయుల సమక్ష్యం లో చూశారట.

ఈ చిత్రాన్ని చూసిన ప్రతీ ఒక్కరు ‘అఖండ’ కంటే బాగుంది అంటూ పొగడ్తలతో ముంచి ఎత్తారట. బాలయ్య బాబు ని తెలంగాణ స్లాంగ్ లో ఇప్పటి వరకు చూడలేదు, మొదటిసారి తెలంగాణ స్లాంగ్ లో మాట్లాడినప్పటికీ పదికాలాల పాటు ప్రేక్షకులు గుర్తించుకునేలా ఉందని పొగడ్తలతో ముంచి ఎత్తారట.

- Advertisement -

అంతే కాదు బాలయ్య మార్క్ మాస్ యాక్షన్ ని ఎక్కడా మిస్ కాకుండా, తన మార్కు ఎంటెర్టైన్మెంట్ యాంగిల్ ని కూడా పర్ఫెక్ట్ గా బ్యాలన్స్ చేసారంటూ కితాబు ఇచ్చారు. ఇలా ఎంటర్టైన్మెంట్ మరియు మాస్ రెండు సమపాళ్లలో వచ్చిన బాలయ్య సినిమా గడిచిన దశాబ్ద కాలం లో రాలేదని, ఈ చిత్రం ఎవ్వరూ ఊహించని రేంజ్ కి వెళ్తుంది అంటూ ప్రశంసల వర్షం కురిపించారట. మరి ఇక్కడ వచ్చిన టాక్ కి తగ్గట్టుగా సినిమా ఉంటుందో లేదో చూడాలి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here