నువ్వే కావాలి మూవీతో మంచి గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ విజయభాస్కర్. ఇప్పటికీ కూడా ఇండస్ట్రీలో లవ్ స్టోరీ అంటే టక్కున గుర్తొచ్చే చిత్రం నువ్వే కావాలి. తరుణ్ రీచా హీరో హీరోయిన్స్ గా నటించిన ఈ చిత్రం 2000 సంవత్సరంలో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. బాల నటుడు గుర్తింపు తెచ్చుకున్న తరుణ్ హీరోగా పరిచయం చేసిన చిత్రం నువ్వే కావాలి.
ఆ తర్వాత వరుసగా నువ్వు నాకు నచ్చావ్, మన్మధుడు, మల్లీశ్వరి, జై చిరంజీవ వంటి సూపర్ హిట్ చిత్రాలు తీశారు.అయితే ప్రస్తుతం విజయ భాస్కర్ గురించి అతని అల్లుడు రవి శివతేజ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
కీరవాణి కొడుకు శ్రీ సింహ హీరోగా నటించిన ఉస్తాద్ మూవీలో రవి శివతేజ అతని బెస్ట్ ఫ్రెండ్ క్యారెక్టర్ లో నటించాడు. ప్రస్తుతం అతను పలు రకాల షార్ట్ ఫిలిమ్స్ లో నటిస్తూ బాగా బిజీగా ఉన్నాడు. తాజాగా యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఉస్తాద్ సినిమా గురించి శివతేజ మాట్లాడారు.సినిమా గురించే కాకుండా ఆయన బిగ్ బాస్ షో గురించి కూడా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
తెలుగులో 400కు పైగానే షార్ట్ ఫిలిమ్స్ లో నటించిన రవి విజయ్ భాస్కర్ కూతుర్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే బిగ్బాస్ షోలో పాటిస్పేట్ చేయాలి అని రవి అనుకున్నప్పుడు.. అతని భార్య షోలో పాటిస్పేట్ చేస్తే విడాకులు ఇస్తాను అని అందట. ఈ విషయాన్ని అతను ఎంతో సరదాగా నవ్వుతూ అన్నాడు. ఇక బిగ్ బాస్ సీజన్ 7 త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది.