పట్టపగలు బిగ్ బాస్ బ్యూటీ తో మహేష్ బాబు రొమాన్స్.. ఇది కలలో కూడా ఎవ్వరూ ఊహించి ఉండరు!

- Advertisement -

ప్రస్తుతం టాలీవుడ్ మొత్తం ఎంతో ఆత్రుతతో ఎదురు చూస్తున్న సినిమాలలో ఒకటి మహేష్ బాబు హీరో గా నటిస్తున్న ‘గుంటూరు కారం’ అనే చిత్రం. త్రివిక్రమ్ లాంటి స్టార్ డైరెక్టర్ తో హిట్ మీద హిట్ కొట్టి ఫుల్ ఫామ్ లో ఉన్న మహేష్ బాబు చేస్తున్న సినిమా కావడం తో ఈ చిత్రం పై అటు అభిమానుల్లో ఎంత అంచనాలు అయితే ఉన్నాయో, ప్రేక్షకుల్లో కూడా అంతే అంచనాలు ఉన్నాయి. అందుకే ట్రేడ్ ఈ చిత్రాన్ని భారీ రేట్స్ కి అన్నీ ప్రాంతాలలో కొనుగోలు ప్రారంభించారు.

మహేష్ బాబు
మహేష్ బాబు

వాళ్ళు అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా అన్నీ ప్రాంతాలకు కలిపి 160 కోట్ల రూపాయలకు ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ జరిగినట్టు చెప్తున్నారు. ఇది టాలీవుడ్ లో నాన్ రాజమౌళి రికార్డు గా చెప్పుకోవచ్చు. సంక్రాంతి కానుకగా జనవరి 12 వ తారీఖున విడుదల అవ్వబోతున్న ఈ సినిమా అభిమానుల అంచనాలను అందుకుంటుందో లేదో చూడాలి.

ఇకపోతే ఈ సినిమాలో హీరోయిన్ గా శ్రీలీల నటిస్తుండగా, సెకండ్ హీరోయిన్ గా మీనాక్షి చౌదరి నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ముందుగా శ్రీలీల స్థానం లో పూజ హెగ్డే, అలాగే మీనాక్షి చౌదరి స్థానం లో శ్రీలీల ఉండాలి. కానీ పూజ హెగ్డే కొన్ని అనుకోని కారణాల వల్ల ఈ సినిమా నుండి తప్పుకోవడం తో ఆమె స్థానం లోకి మీనాక్షి చౌదరి వచ్చింది. ఇప్పుడు మరో హాట్ బ్యూటీ ఈ సినిమాలో మహేష్ బాబు తో రొమాన్స్ చేయబోతుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

- Advertisement -

ఆమె మరెవరో కాదు నోరా ఫతేహి. ఈ హాట్ బ్యూటీ కి సోషల్ మీడియా లో ఎంత మంచి క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ ద్వారా హాట్ ఫోటోలను అప్లోడ్ చేస్తూ కుర్రకారులకు మత్తెక్కిస్తూ ఉంటుంది. బాలీవుడ్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించిన ఈమె, హిందీ బిగ్ బాస్ లో ఒక టాప్ కంటెస్టెంట్ గా మంచి పేరు తెచ్చుకుంది. అలాంటి హాట్ బ్యూటీ ఇప్పుడు మహేష్ బాబు సినిమాలో ఐటెం సాంగ్ చెయ్యబోతుండడం తో అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఈమె ఈ చిత్రం తో పాటుగా పవన్ కళ్యాణ్ తో ‘హరిహర వీరమల్లు’ సినిమాలో కూడా నటిస్తుంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here