Rashmika : తన అభిమానులకు థ్యాంక్స్ చెబుతూ రష్మిక పెట్టిన పోస్ట్ వైరల్‌గా మారింది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే తారల్లో రష్మిక ఒకరు. తన సినిమా విశేషాలను ఎప్పటికప్పుడు పంచుకుంటూ అభిమానుల్లో జోష్ నింపుతుంటారు. తాజాగా జరిగిన ‘యానిమల్’ ప్రీరిలీజ్ ఈవెంట్‌కు సంబంధించిన కొన్ని ఫొటోలను ఆమె షేర్ చేశారు. ప్రస్తుతం అవి నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి.

‘ఈ ఫొటోలు నాకెంతో నచ్చాయి. వీటిని ఇంత అందంగా తీసిన వారికి కృతజ్ఞతలు. నిన్న ఈవెంట్లో మీ అందరి ప్రేమ, గౌరవం, నాపై ఉన్న అభిమానం.. ఇవన్ని కలిసి అద్భుతమైన క్షణాలను అందించాయి. హద్దులు లేని మీ అభిమానానికి ఎప్పుడూ నేను ఆశ్చర్యపోతుంటాను. మూడు రోజుల్లో ‘యానిమల్’తో మీ అందరినీ పలకరించడానికి రానున్నా’ అంటూ అభిమానులకు రష్మిక కృతజ్ఞతలు చెప్పారు. ఇక తాజాగా జరిగిన ఈ ప్రీరిలీజ్ ఈవెంట్‌కు రాజమౌళి, మహేశ్‌బాబు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రష్మికను ఉద్దేశిస్తూ మహేశ్ బాబు మాట్లాడుతూ ఆమె అన్ని భాషల్లో నటించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఆమె ప్రయాణం ఎంతో స్ఫూర్తిదాయకమంటూ ప్రశంసించారు. ఆప్యాయంగా హత్తుకుని అభినందించారు.

ఇక రష్మిక తన స్వీట్ స్వీట్ వాయిస్‌తో మహేష్ బాబును పొగిడేసింది. ఈ హిజ్ సో క్యూట్, సో స్వీట్, సో హ్యాండ్సమ్ అంటూ పొగిడేసింది. ఆమె అలా క్యూట్‌గా చెప్పడంతో మహేష్ బాబు నవ్వుతూ రష్మికను గట్టిగా హగ్ చేసుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. కాగా, రష్మిక, మహేష్ బాబు కలిసి సరిలేరు నీకెవ్వరు సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో బ్యూటిఫుల్ పాటతోనే మహేష్ బాబును పొగిడేసింది. ఇది చూసిన వారంతా ఏంటి రష్మిక మహేష్ పై మోజు పడుతుందా అనుకుంటున్నారు.