Allu arjun : స్కంద ఎఫెక్ట్.. బోయపాటితో సినిమాకు ఓ కండిషన్ పెట్టిన అల్లు అర్జున్

- Advertisement -


Allu arjun : పుష్ప నీయమ్మ తగ్గేదేలే అంటూ పాన్ ఇండియా లెవల్లో గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన డ్యాన్స్ లతోనే కాదు.. యాక్టింగ్ లోనూ ఇరగదీస్తూ జాతీయ స్థాయి ఉత్తమ నటుడు అవార్డును అందుకున్నాడు. చేసిన ప్రతి సినిమాకు ప్రాణం పెట్టి తీసే హీరోలలో అల్లు అర్జున్ ముందుంటారు. అటు మాస్ అయినా.. ఇటు క్లాస్ అయిన ఏదైనా సరే అల్లు అర్జున్ చేశాడంటే హిట్ కావాలంతే. ఇది ఇలా ఉంటే.. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను, అల్లు అర్జున్ కాంబో లో వచ్చిన సరైనోడు సినిమా ఎంత పెద్ద సక్సెస్ అయిందో తెలిసిందే.

Allu arjun :

ఆ సినిమా తర్వాత మరోసారి వారి కాంబోలో సినిమా రాలేదు. వీరిద్దరి కాంబినేషన్లో మరో సినిమా రావాలని బన్నీ ఫ్యాన్స్ కోరుకున్నారు. ఇక వారు కోరుకున్నట్లుగానే ఇన్నాళ్లకు బోయపాటితో అల్లు అర్జున్ మూవీ ఓకే అయ్యిందట. కానీ బోయపాటికి అల్లు అర్జున్ కొన్ని కండీషన్స్ పెట్టక తప్పలేదట. ఎందుకంటే పుష్ప సినిమా తర్వాత అల్లు అర్జున్ ఇమేజ్ పెరిగిపోయింది. అందుకని ఆచీ తూచీ అడుగు వేయాలి. ఒక వేళ సినిమా ఉల్టా ఫల్టా అయితే పాన్ ఇండియా స్థాయి నుంచి వెనక్కి వెళ్లి పోయే అవకాశం ఉంది. ఇక దీనికి తోడు రీసెంట్ గా బోయపాటి శ్రీనివాస్ రూపొందించిన స్కంద సినిమా కూడా డిజాస్టర్ అవ్వడం. ఈ సినిమా కారణంగా బోయపాటి కెరీర్ కు కొంత బ్యాడ్ నేమ్ కూడా వచ్చింది. ఈ కారణాలు చేత బన్ని బోయపాటికి కండీషన్స్ పెట్టాడని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here