Rashmika Mandanna : నేషనల్ క్రష్ రష్మిక పాపులారిటీ రోజురోజుకు పెరిగిపోతోంది. ముఖ్యంగా బాలీవుడ్లో ఈ భామ పేరు మార్మోగిపోతోంది. కిరీక్ పార్టీ సినిమాతో అరంగేట్రం చేసిన ఈ భామ.. ఛలో సినిమాతో టాలీవుడ్లో అడుగుపెట్టింది. మొదటి సినిమాలో రష్మిక అందం, అభినయం చూసిన తెలుగు కుర్రాళ్లు.. చూసీచూడంగానే నచ్చేశావే అంటూ పాడుకున్నారు. ఈ సినిమా రష్మికకు సూపర్ హిట్‌ను తెచ్చిపెట్టింది. ఇక ఈ మూవీ తర్వాత రష్మికకు వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం రాలేదు. గీతాగోవిందం, డియర్ కామ్రేడ్, భీష్మ, ఆడవాళ్లు మీకు జోహార్లు, పుష్ప, వారిసు సినిమాలతో ప్రేక్షకులను అలరించింది రష్మిక.
రష్మిక సోషల్ మీడియాలోనూ చాలా పాపులర్. ఈ భామకు నెట్టింట ఫుల్ క్రేజ్ ఉంది. అందుకే ఫొటోలు పోస్టు చేస్తే క్షణాల్లో వైరల్ అవుతాయి. తాజాగా రష్మిక బజార్ మేగజైన్ కోసం ఫొటోషూట్ చేసింది. ఇందులో వైట్ సూట్లో రష్మిక సూపర్ కూల్‌గా కనిపించింది. ఈ ఫొటోషూట్ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ బ్యూటీ డ్యాపర్ లుక్ చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.
ఈ బ్యూటీ సినిమాలతోనే కాదు తన యాటిట్యూడ్‌తో కూడా ప్రేక్షకులను ఆకర్షించింది. ఈ భామ క్యూట్‌నెస్‌కు మెచ్చిన ప్రేక్షకులు ఏకంగా ఈ బ్యూటీని నేషనల్ క్రష్ చేసేశారు. నేషనల్ క్రష్‌గా రష్మికకు పాపులారిటీ వచ్చిన తర్వాత సినిమా అవకాశాలు ఎక్కువగా వచ్చాయి. అలా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో కలిసి పుష్పలో నటించే అవకాశం వచ్చింది. ఈ సినిమాలో శ్రీవల్లిగా రష్మిక నటనకు వంద మార్కులు పడ్డాయి. డీ గ్లామర్ పాత్రలోనూ రష్మిక ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. సామి.. నా సామి అంటూ స్టెప్పులేసి యావత్ ఇండియన్ సినిమాను ఊపేసింది.
ఇక పుష్ప సినిమాతో రష్మిక రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. పాన్ ఇండియా లెవెల్లో గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ బాలీవుడ్లో వరుస ఆఫర్లు వస్తున్నాయి. ఇప్పటికే అరడజను బీ టౌన్ సినిమాలకు సైన్ చేసింది. అందులో గుడ్ బై, మిషన్ మజ్ను రిలీజ్ అయి ముంబయి ప్రేక్షకులను అలరించాయి. ప్రస్తుతం రష్మిక అటు యానిమల్.. ఇటు పుష్ప 2 సినిమాల షూటింగులో బిజీగా ఉంది.