Rashmika Mandanna : దీపిక పోజ్ కాపీ చేసిన నేషనల్ క్రష్.. వావ్ అంటూ నెటిజన్స్ ఫిదా

- Advertisement -

Rashmika Mandanna : రష్మిక మందన్న.. ఒక్క సినిమాతో ఈ భామ నేషనల్ క్రష్ అయిపోయింది. అప్పటి నుంచి ఆ స్థానంలోనే కొనసాగుతోంది. టాలీవుడ్ హిట్ ల మీద హిట్ లు కొట్టిన ఈ భామ ఆ తర్వాత బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడు అక్కడ కూడా తన హవా సాగిస్తూ దూసుకెళ్తోంది. ఇలా పాన్ ఇండియా హీరోయిన్ గా రష్మిక ఫుల్ బిజీ అయిపోయింది.

ఇక సోషల్ మీడియాలోనూ రష్మికకు ఫాలోయింగ్ ఎక్కువే. ఈ బ్యూటీ ఫొటోలు పోస్టు చేస్తే చూడాలని చాలా మంది కుర్రాళ్లు ఎదురు చూస్తూ ఉంటారు. ఈ భామ క్యూట్ నెస్ కు పడిపోని వారుండరు. రష్మిక తన ఫ్యాన్స్ ను రిసీవ్ చేసుకునే విధానం, వారితో ఇంటరాక్ట్ అయ్యే విధానం కూడా అభిమానుల్లో ఆమెపై ప్రేమ పెరగడానికి కారణం అని చెప్పొచ్చు.

- Advertisement -

తాజాగా రష్మిక తన లేటెస్ట్ ఫొటోలు పోస్టు చేసింది. ఇందులో బ్లాక్ కలర్ లాంగ్ ఫ్రాక్ ధరించి కనిపించింది. ఔట్ అండ్ ఔట్ బ్లాక్ ఔట్ ఫిట్ లో రష్మిక మెస్మరైజ్ చేసింది. ఇక కైపెక్కించే చూపులతో వలపు గాళం వేసింది. అయితే రష్మిక తన కుడి చేతిన తలకు కుడివైపు పెట్టి ఎడమ చేతిన నడుం వద్ద పెట్టి ఓ పోజు ఇచ్చింది.

అయితే ఈ పోజు చూసిన నెటిజన్లు అచ్చం దీపికా పడుకోణ్ సిగ్నేచర్ పోజులాగే ఉందని కామెంట్లు చేస్తున్నారు. రష్మిక దీపిక పోజ్ ను కాపీ చేసిందని అంటున్నారు. ఏదేమైనా ఈ డ్రెస్సులో రష్మిక మాత్రం కత్తిలా ఉంది అంటూ కొందరు కామెంట్లు పెట్టారు. మొత్తానికి రష్మిక లేటెస్ట్ ఫొటోలు బాగా వైరల్ అవుతున్నాయి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here