Rashmika Mandanna .. పుష్ప సినిమా తర్వాత ప్రస్తుతం ఈ పేరు తెలియని వారుండరు. ఇండస్ట్రిలో నేషనల్ క్రష్ గా పేరు సంపాదించుకుంది ఈ అమ్మడు. నాగశౌర్య సరసన ఛలో అనే సినిమా ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయింది. ఈ సినిమా తర్వాత వచ్చిన గీతగోవిందం సినిమా ఆమె తన తలరాతను మార్చేసింది. ఎంతలా అంటే ఆమె పేరు పాన్ ఇండియా లెవెల్ లో గుర్తింపు తెచ్చుకుంంది. పుష్ప ఛాన్స్ అందుకునేందుకు కూడా ఈ సినిమానే కారణంగా చెప్పుకొవచ్చు. సోషల్ మీడియాలో నిరంతరం యాక్టివ్ గా ఉంటుంది రష్మిక. ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటూనే ఉంటుంది.

ఇటీవల రష్మిక మందన్నా చేసిన పోస్టు తన అభిమానులకు కన్ఫ్యూజన్లో పడేసంది. తాను ఫ్యామిలీని మిస్ అవుతున్నాను.. ఇంటిని మిస్ అవుతున్నాను అంటూ ఒక పోస్ట్ పెట్టింది. ఈ పోస్ట్ చూసిన జనాలకు కొత్త అనుమానాలు వస్తున్నాయి. నువ్వు మిస్ అవుతున్నాను అని పెట్టిన పోస్ట్ మీ తల్లిదండ్రుల గురించా..?.. లేక నీ బాయ్ ఫ్రెండ్ విజయ్ దేవరకొండ గురించా..? అంటూ కొంటెగా కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు అంతగా మిస్ అవుతుంటే షూటింగ్స్ కి బ్రేక్ చెప్పే ఇంటికి వెళ్లు ..దీనికేం మాయ రోగం అంటూ ఘాటుగా వ్యాఖ్యానిస్తున్నారు.
రష్మిక పెట్టిన పోస్ట్ ఇప్పుడు విజయ్ దేవరకొండ పై ఆమెకున్న ప్రేమను రెట్టింపు డౌట్స్ కలిగేలా చేస్తుంది. రష్మిక పెట్టిన పోస్ట్ ఎవరి గురించి తెలియదు కానీ సోషల్ మీడియాలో మాత్రం విజయ్ దేవరకొండ.. రష్మికల ప్రేమాయణానికి సంబంధించిన విషయాలు మరోసారి హాట్ హాట్ గా చర్చనీయాంశమవుతున్నాయి. ఈ జంట ప్రేమించుకుంటున్నారు అని.. త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారంటూ తెగ ప్రచారం జరిగింది. అయితే అలాంటిది ఏమీ లేదంటూ రష్మిక, విజయ్ పలు సందర్భాలలో కొట్టి పడేశారు. కానీ వాళ్ళ మధ్య ప్రేమ ఉందన్న విషయాన్నే జనాలు బలంగా నమ్ముతున్నారు.
View this post on Instagram