Rashmika Mandanna : టాలీవుడ్ లో ఆ హీరో కోసం ప్రాణాలైనా ఇచ్చేస్తా అంటూ రష్మిక షాకింగ్ కామెంట్స్!

- Advertisement -

Rashmika Mandanna : ఇండస్ట్రీ లోకి వచ్చిన అతి తక్కువ సమయం లోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగి కొంతకాలం నెంబర్ 1 స్థానం లో కొనసాగిన నటి రష్మిక మందన. చలో సినిమాతో కెరీర్ ని ప్రారంభించిన ఆమె ‘గీత గోవిందం’ చిత్రం తో భారీ బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకొని తన సత్తా చాటింది. ఈ సినిమా తర్వాత ఆమె మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.

Rashmika Mandanna
Rashmika Mandanna

సౌత్ లో పెద్ద స్టార్ హీరోల సరసన నటించి వేరే లెవెల్ కి చేరుకుంది. పుష్ప సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో క్రేజ్ ని సంపాదించుకున్న రష్మిక, గత ఏడాది బాలీవుడ్ ‘ఎనిమల్’ సినిమాలో హీరోయిన్ గా నటించి భారీ బ్లాక్ బస్టర్ ని తన ఖాతాలో వేసుకుంది. ఈ చిత్రం లో ఆమె నటన బాలీవుడ్ ఆడియన్స్ ని ముగ్దుల్ని చేసింది. ఈ సినిమా తర్వాత ఆమెకి బాలీవుడ్ ఇప్పుడు వరుసగా అవకాశాలు క్యూ కడుతున్నాయి.

Rashmika Mandanna Photos

ఇది ఇలా ఉండగా రష్మిక మన టాలీవుడ్ లో మహేష్ బాబు , అల్లు అర్జున్ తో తప్ప మిగిలిన స్టార్ హీరోలతో నటించలేదు. భవిష్యత్తులో చేయొచ్చేమో కానీ, ఏ స్టార్ హీరోయిన్ కూడా తమ అభిమాన నటుడు ఎవరు అనేది చెప్పరు. ఎందుకంటే అవకాశాలకు గండి పడుతుందనే భయం ప్రతీ ఒక్కరిలోనూ ఉంటుంది. కానీ రష్మిక మాత్రం రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో తన అభిమాన తెలుగు హీరో ఎవరో చెప్పేసింది.

- Advertisement -

ప్రస్తుతం ఉన్న హీరోలలో జూనియర్ ఎన్టీఆర్ అంటే తనకు చాలా ఇష్టమని, #RRR చిత్రం లో అతని నటనకి కన్నీళ్లు పెట్టుకున్నాను అంటూ చెప్పుకొచ్చింది. ఆయన సినిమాలో కేవలం హీరోయిన్ రోల్ కోసం ఎదురు చూడడం లేదు, ఎలాంటి పాత్ర ఇచ్చిన చేసేస్తాను, ఎన్టీఆర్ కోసం ఏమి చేయడానికైనా రెడీ అంటూ ఆమె చెప్పిన ఈ మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here