Kethika Sharma : సాయి ధరమ్ తేజ్ లాంటి భర్త కావాలి అంటూ కుర్ర హీరోయిన్ షాకింగ్ కామెంట్స్!

- Advertisement -

Kethika Sharma : ఇండస్ట్రీ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లిస్ట్ తీస్తే ప్రభాస్ తర్వాతి స్థానం లో నిలిచే హీరో సాయి ధరమ్ తేజ్. తన తోటి హీరోలందరూ ఒకరి తర్వాత ఒకరు పెళ్లి చేసుకొని తమ బ్యాచిలర్ జీవితానికి టాటా చెప్తుంటే సాయి ధరమ్ తేజ్ మాత్రం పెళ్లి పేరు తీస్తే పారిపోతున్నాడు. రీసెంట్ గానే ఆయన కజిన్ వరుణ్ తేజ్ కూడా లావణ్య త్రిపాఠి ని పెళ్లి చేసేసుకున్నాడు.

కానీ సాయి ధరమ్ తేజ్ కి మాత్రం పెళ్లి అంటే అసలు ఇష్టమే లేదు అన్నట్టుగా అనేక ఇంటర్వ్యూస్ లో చెప్పాడు. ఇండస్ట్రీ లో పలువురి హీరోయిన్స్ తో ప్రేమాయణం నడిపి, బ్రేకప్స్ కూడా జరిగాయని చెప్పుకొచ్చిన సాయి ధరమ్ తేజ్ గురించి పలువురి హీరోయిన్స్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసారు. రీసెంట్ గానే వరుణ్ తేజ్ ని పెళ్లాడిన లావణ్య త్రిపాఠి గతం లో జరిగిన ఒక ఇంటర్వ్యూ లో సాయి ధరమ్ తేజ్ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది.

ఆమె మాట్లాడుతూ ‘ సాయి ధరమ్ తేజ్ హస్బెండ్ మెటీరియల్..ఏ అమ్మాయి అయినా అలాంటి భర్త కావాలని కోరుకుంటుంది. ఈ విషయం నేను వరుణ్ తేజ్ తో కూడా అనేక సందర్భాలలో తెలిపాను’ అంటూ చెప్పుకొచ్చింది లావణ్య త్రిపాఠి. రీసెంట్ గా మరో యంగ్ హీరోయిన్ కేతిక శర్మా కూడా ఇదే చెప్పుకొచ్చింది. ఈమెతో కలిసి సాయి ధరమ్ తేజ్ ‘బ్రో’ అనే చిత్రం చేసిన సంగతి మన అందరికీ తెలిసిందే.

- Advertisement -
Kethika Sharma
Kethika Sharma

రీసెంట్ కేతిక శర్మ ఇంస్టాగ్రామ్ లో అభిమానులతో చేసిన లైవ్ చిట్ చాట్ లో ఒక ఫ్యాన్ ఆమెని ‘మీరు సాయి ధరమ్ తేజ్ మరియు వైష్ణవ్ తేజ్ ఇద్దరితో కలిసి సినిమాలు చేసారు. వీళ్ళిద్దరిలో హస్బెండ్ మెటీరియల్ ఎవరు? ‘ అని అడుగుతాడు. దానికి కేతిక శర్మ సమాధానం చెప్తూ ‘సాయి ధరమ్ తేజ్ హస్బెండ్ మెటీరియల్. వైష్ణవ్ తేజ్ కూడా చాలా మంచి అబ్బాయి. ఇద్దరు నాకు మంచి క్లోజ్ ఫ్రెండ్స్. వైష్ణవ్ తేజ్ నేను అయితే చిన్న పిల్లలు లాగ కొట్టుకుంటాము. సాయి ధరమ్ తేజ్ తో నేను నా వ్యక్తిగత విషయాలను కూడా పంచుకుంటూ ఉంటాను’ అని చెప్పుకొచ్చింది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here