Rashmika Mandanna : బజార్ ఇండియా ఫొటోషూట్ లో రష్మిక గ్లామర్ ట్రీట్ అదరహో

- Advertisement -

Rashmika Mandanna నేషనల్ క్రష్ ఫుల్ జోష్ లో ఉంది. ఓవైపు సినిమాల్లో.. మరోవైపు సోషల్ మీడియాలో.. ఇంకోవైపు బ్రాండ్ ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా ఉంది. తాజాగా ఈ బ్యూటీ పలు ఇంటర్నేషనల్ బ్రాండ్లకు కూడా బ్రాండ్ అంబాసిడర్ గా మారింది. రోజురోజుకు రష్మిక రేంజ్ పెరిగిపోతోంది.

Rashmika Mandanna
Rashmika Mandanna

రష్మిక మందన్నకు ఫ్యాన్స్ ఇండియాలోనే కాదు విదేశాల్లో కూడా ఉన్నారట. అందుకే ఇంటర్నేషనల్ బ్రాండ్స్  ఈ బ్యూటీని సెలెక్ట్ చేసుకుంటున్నాయి. మరోవైపు ఇండియాలోనూ ఈ భామ హవా మామూలుగా లేదు. సౌత్ లో కాస్త నెగిటివి వచ్చినా.. అభిమానులకు కొదువేం లేదు. ఇక నార్త్ లో అయితే.. ముఖ్యంగా బాలీవుడ్ లో ఈ భామను అందలమెక్కిస్తున్నారు అక్కడి ప్రేక్షకులు.

- Advertisement -

రష్మిక ఎక్కడ కనిపించినా బీ టౌన్ మీడియా అసలు వదలడం లేదు. వారికి తగ్గట్టుగా రష్మిక తన క్యూట్ క్యూట్ పోజులుతో.. స్వీట్ మాటలతో వారి మనసు దోచేస్తోంది. సౌత్ లో ఈ బ్యూటీ హవా కూడా ఏం తగ్గలేదు. ఇటీవల కొన్ని కాంట్రవర్సీలతో ఈ భామపై సౌత్ నెటిజన్లు ట్రోలింగ్ చేస్తున్నా.. వారిని అడ్డుకునేందుకు రష్మిక ఆర్మీ స్ట్రాంగ్ గా ప్రయత్నించింది.

Mandanna
Rashmika Mandanna

ఇక తాజాగా రష్మిక తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేసిన ఫొటోలు చూసి అందరూ షాకయ్యారు. ఈ బ్యూటీ నేషనల్ క్రష్ గా మారిన తర్వాత  అందాల ఆరబోత డోస్ ను కాస్త పెంచేసిందని చెప్పొచ్చు. ఇంకా బాలీవుడ్ కు వెళ్లిన తర్వాత ఈ భామ అక్కడి ట్రెడిషన్ కు బాగా అలవాటైనట్టుంది. బీ టౌన్ బ్యూటీస్ కు దీటుగా గ్లామర్ ట్రీట్ ఇస్తూ తానేం తక్కువ కాదని ప్రూవ్ చేస్తోంది. ఈ అందాల ప్రదర్శనతో రష్మిక కాస్త అవకాశాలు ఎక్కువే తన బుట్టలో వేసుకుంటోందని కొందరు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

తాజాగా రష్మిక బజార్ ఇండియా మేగజైన్ కోసం ఫోటో షూట్ చేసింది. ఈ ఫొటోషూట్ లో రష్మిక ఓ మోస్తరుగా అందాలు ఆరబోసింది. ముఖ్యంగా క్రీమ్ కలర్ బ్లేజర్ ధరించి ఎద అందాలు చూపిస్తూ కుర్రాళ్లను టెంప్ట్ చేసింది. అదే రంగు బాటమ్ ధరించి హాట్ గా పోజులిచ్చింది. 

మరో ఫొటోలో కుర్చీపై కూర్చొని విరహంతో కూడిన పోజులిస్తూ వయ్యారంగా చూపుల గాలం వేసింది. రష్మిక మత్తు చూపులు చూసి కుర్రాళ్ల మనసు చెడిపోతోంది. ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో సెగలు పుట్టిస్తున్నాయి. ఈ ఫొటోల్లో రష్మికను చూసిన కుర్రాళ్లు ఆమె అందానికి ఫిదా అవుతున్నారు. ఈ బ్యూటీ గ్లామర్ ట్రీట్ చూసి రకరకాలు కామెంట్లు చేస్తున్నారు. 

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here