Rashmika : విజయ్ దేవరకొండను ఉద్దేశిస్తూ రష్మిక ట్వీట్ చేశారు. విజయ్ దేవరకొండ ఎప్పటికీ ది బెస్ట్ అని ఆమె అన్నారు. ఇంతకీ రష్మిక ఉన్నట్టుండి విజయ్ గురించి ట్వీట్ చేయడానికి గల కారణం ఏమిటంటే..? రణ్‌బీర్ కపూర్ – రష్మిక ప్రధాన పాత్రల్లో నటించిన మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘యానిమల్’. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ఇది సిద్ధమవుతోంది.

రణ్‌బీర్ పుట్టినరోజును పురస్కరించుకుని గురువారం ఉదయం ఈ సినిమా టీజర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. దీనిని ఉద్దేశిస్తూ విజయ్ దేవరకొండ ట్వీట్ చేశారు. టీజర్ తనకెంతో నచ్చిందన్నారు. ‘‘మై డార్లింగ్స్ సందీప్ రెడ్డి వంగా, రష్మిక.. అలాగే నాకెంతో ఇష్టమైన నటుడు రణ్‌బీర్ కపూర్‌కు ఆల్ ది బెస్ట్’’ అని రాసుకొచ్చారు. దీనిపై తాజాగా రష్మిక స్పందించారు. ‘‘థ్యాంక్యూ విజయ్ దేవరకొండ. నువ్వు ఎప్పటికీ ది బెస్ట్’’ అని రిప్లై ఇచ్చారు. మరోవైపు, నిర్మాత నాగవంశీ సైతం ‘యానిమల్’ టీమ్‌ను మెచ్చుకున్నారు.

‘‘వైలెంట్లీ ఎక్స్‌ప్లోజివ్!! సందీప్.. వైలెన్స్ అంటే ఎలా ఉంటుందో ఈ ప్రపంచానికి చూపిస్తానంటూ గతంలో నువ్వు చెప్పినట్టుగానే ఈ టీజర్‌తో పరిచయం చేశావు. రణ్‌బీర్ కళ్లల్లోని ఆ తీవ్రత చూస్తుంటే డిసెంబర్ 1న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లు బద్దలయ్యేలా ఉన్నాయి’’ అని ఆయన ట్వీట్ చేశారు. నెటిజన్లు సైతం ‘యానిమల్’ టీజర్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. టీజర్ మరోస్థాయిలో ఉందని.. హిట్ ఖాయం అంటున్నారు.