రష్మిక మందన్న కు ఉన్న క్రేజ్ గురించి విడిగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక పుష్ప సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో క్రేజ్ ను సొంతం చేసుకున్నాడు సుకుమార్. మరి అలాంటి సుకుమార్ రష్మిక మందన్న కు అడ్డంగా దొరకడం ఏంటి అనుకుంటున్నారా.. ఇంతకీ సుకుమార్ ఏం తప్పు చేస్తుంటే.. రష్మిక చూసి ఉంటుంది. అసలే సినిమా ఇండస్ట్రీ. ఈ రంగుల ప్రపంచంలో హీరో-హీరోయిన్, హీరోయిన్-దర్శకుడు, హీరోయిన్-నిర్మాతలపై రకరకాలుగా వార్తలు వినిపిస్తుంటాయి. అలాంటిదేమైనా ఉందా? అనే అనుమానాలు కూడా రావడం సహజమే. కానీ విషయం అది కాదు.

సుకుమార్ కనుక తన తదుపరి ప్రాజెక్ట్‌లో అవకాశం ఇవ్వకుంటే.. తన దగ్గరున్న ఓ ఆడియోని లీక్ చేస్తానంటూ రష్మిక ఆటపట్టిస్తుందట. అది విషయం. ఇంతకీ రష్మిక దగ్గర ఉన్న ఆడియో ఏమిటని అనుకుంటున్నారా? సుకుమార్ ఒకానొక టైమ్‌లో రష్మిక దగ్గర ఇండస్ట్రీలోని హీరోయిన్ల గురించి కామెంట్స్ చేశాడట. అతను మాట్లాడుతుండగా రష్మికా మందన్నా దానిని రికార్డ్ చేసిందట. హీరోయిన్ల గురించి సుకుమార్ మాట్లాడిన మాటలు కనుక బయటికి వస్తే.. ఆయన పరువు పోవడం ఖాయమనేలా ఉన్న ఆ ఆడియోతో రష్మిక ఆటపట్టింస్తుందనేలా ఆయన యూనిట్‌లోని కొందరు మాట్లాడుకుంటున్నారు.

ఇక ప్రస్తుతం రష్మిక పుష్ప-2 మూవీతో బిజీగా ఉంది. ఇందులో అల్లు అర్జున్ మరోసారి తనదైన విధ్వంసకరమైన పర్ఫార్మెన్స్‌తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. కాగా, ఈ సినిమాకు రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా, ఈ మూవీలో అందాల భామ రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోంది. ఇక ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తున్నారు. పుష్ప-2 చిత్రానికి సంబంధించిన ఆడియో రైట్స్ ను ప్రముఖ సంస్థ టీ-సిరీస్ ఏకంగా రూ.65 కోట్ల భారీ రేటుకు సొంతం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఒక సినిమా ఆడియో రైట్స్‌కే ఇంత మొత్తంలో భారీ రేటు రావడంతో ఇండియన్ సినిమా చరిత్రలోనే ఇది హయ్యెస్ట్‌గా సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది.