ఓరి దేవుడో.. ఆ డైరెక్టర్ ను ఉంచుకుంటానని డైరెక్ట్ చెప్పేసిన హీరోయిన్ ఎవరో తెలుసా?

- Advertisement -

తెలుగు చిత్రపరిశ్రమలో వేరే రాష్ట్రాల హీరోయిన్లకు మంచి డిమాండ్ ఉన్న విషయం తెలిసిందే.. తెలుగు భాష రాకున్నా కూడా వచ్చి రాని తెలుగుతో అందంతో ఆకట్టుకుంటున్నారు.. వాళ్ల మాటలకు చాలా మంది ఫిదా అవుతుంటారు.. వారి అభిప్రాయం మంచిదే అయినా వారు వాడే పదాల వల్ల డబుల్ మీనింగ్స్ వస్తుంటాయి.

మాళవిక నాయర్
మాళవిక నాయర్

తాజాగా ఇలాంటి సంఘటనే జరిగింది. ఓ హీరోయిన్ డైరెక్టర్ తో నేను నిన్ను ఉంచుకుంటా అనడం ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ వీడియోను ఏకంగా ఆ హీరోయినే ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేసింది. ఆ హీరోయిన్ పేరు మాళవిక నాయర్. ఆ డైరెక్టర్ మరెవ్వరో కాదు జాతిరత్నాలు ఫెమ్ డైరెక్టర్ కేవీ అనుదీప్.. ఇందుకు సంబందించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది..

Director Anudeep

ఎవడే సుబ్రహ్మణ్యం, ట్యాక్సీవాలా, మహానటి లాంటి మూవీస్ లో నటించింది మాళవిక నాయర్. తన అందంతో, అభినయంతో సినీ ప్రేక్షకులను ఆకట్టుకున్న విషయం తెలిసిందే. జాతిరత్నాలు లాంటి సూపర్ బ్లాక్ బస్టర్ సినిమా తీసిన డైరెక్టర్ అనుదీప్. నీతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నా.. నువ్వేం అనుకోకు అబ్బాయి అంటుంది.. దానికి ఆయన నేనేం అనుకోనులేండి చెప్పండి అంటాడు.. ఏం అనుకోవద్దు మరి అని హీరోయిన్ మాళవిక అనుదీప్ తో అంటుంది. దానికి కేవీ అనుదీప్ నేనేం అనుకోను చెప్పండి అని అంటాడు. వెంటనే మాళవిక మాట్లాడుతూ నిన్ను ఉంచుకుంటాను అబ్బాయ్ అంటుంది.

- Advertisement -

మాళవిక అలా అనడంతో డైరెక్టర్ అనుదీప్ షాక్ అవ్వడంతో పాటు తెగ సిగ్గు పడుతుంటాడు.. వీరిద్దరికి సంబందించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. ఈ వీడియోను స్వయంగా హీరోయిన్ మాళవికనే తన సోషల్ మీడియాలో పోస్టు చేసింది. దీనికి మాళవిక అలా అనుదీప్ గారిని కూడా ఉంచుకోవడం జరిగింది అంటూ క్యాప్షన్ ఇవ్వడం అందరిని తెగ ఆకట్టుకుంటుంది.. ఈ వీడియో వైరల్ అవ్వడంతో నెటిజన్లు రకరకాల కామెంట్స్ పెడుతున్నారు.. ఈ హీరోయిన్ కు సినిమాళ్ళేక ఇలా డైరెక్టర్ తో కానిస్తుందా అంటూ కామెంట్స్ వస్తుండటం గమనార్హం.. ప్రస్తుతం ఓ బోల్డ్ మూవీలో ఈ అమ్మడు నటిస్తుంది..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here