Rashi Khanna : తెలుగుచిత్ర సీమలోకి ఊహలు గుసగుసలాడే సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ రాశి ఖన్నా.. ఆ సినిమా హిట్ అవ్వడంతో ఆ తర్వాత వరుస సినిమాలతో ఫుల్ బిజీ అయిపొయింది..దీంతో తక్కువ టైమ్ లోనే స్టార్ హీరోయిన్ అయ్యింది.తెలుగు ప్రేక్షకులను అలరించిన రాశీ ఖన్నా ప్రస్తుతం బాలీవుడ్ లో పలు సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతుంది. సినిమాలతో పాటు పలు వెబ్ సిరీస్లలో నటిస్తూ తన పేరును పాపులర్ చేసుకుంటుంది. ఈ క్రమంలోనే రీసెంట్గా హిందీలో ‘ ఫర్జీ ‘ సినిమాలో నటించింది. ఈ సినిమాలో బోల్డ్ పర్ఫామెన్స్ తో ప్రేక్షకులను కట్టిపడేసింది. ఇటీవల గ్లామర్ డోస్ పెంచినట్లుగా కనిపిస్తుంది.. వరుస ఫోటో షూట్ లతో సోషల్ మీడియాను షేక్ చేస్తుంది.. అయితే ఈ అమ్మడు వేకేషన్ ను ఉన్న ఫోటోలను షేర్ చేసింది.. కామెంట్లతో నెట్టింట వైరల్ అవుతున్నాయి..

రాశీ ఖన్నా సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులను ఖుషి చేస్తూ ఉంటుంది. గ్లామరస్ ఫోటోలను పెడుతూ అభిమానులను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. ఇటీవల బొద్దుగా ఉన్న ఈ బొమ్మ ఇప్పుడు స్లిమ్ గా తయారై ప్రేక్షకులను కట్టిపడేస్తోంది. అయితే తాజాగా రాశీఖన్నా తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫోటోలను షేర్ చేసింది. తాజాగా వెకేషన్ లో ఉన్నటువంటి ఫోటోలను షేర్ చేసింది. ఈ ఫోటోలను చూసిన నెటిజన్స్ వివిధ రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.. ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం ఫారిన్ లో ఉన్నట్లు తెలుస్తుంది..

రాశికన్నా ప్యారిస్, నెదర్లాండ్లో పలు వెకేషన్స్ లో ఎంజాయ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఒక ఫోటోలో గ్రీన్ కలర్ టీ షర్టు, బ్లాక్ ప్యాంట్, షూస్ వేసుకొని స్టైలిష్ లుక్ లో కనిపించింది. దీంతోపాటు గ్లాస్సెస్ ధరించి అదిరిపోయే లుక్ ఇచ్చింది. మరొక ఫోటోలో రెడ్ జాకెట్, బ్లాక్ ప్యాంట్, షూస్ వేసుకొని స్టైలిష్ లుక్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. దీంతో అభిమానులు రాశికన్నా ఫోటోలను చూసి వివిధ రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.. సినిమా కోసం అయితే వెళ్లలేదని తెలుస్తుంది.. ఓ హీరో తో కలిసి వెళ్లిందని వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.. దీనిపై రకరకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి.. ఇలాంటి ట్విస్ట్ ఇస్తావని అని అనుకోలేదని నెటిజన్లు తెగ ఫీల్ అవుతున్నారు… ఫారిన్ లో కెమెరాలకు చిక్కిన ఫోటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి..