Alia Bhatt : బాలీవుడ్ లో పెను విషాదం చోటు చేసుకుంది, ప్రముఖ నిర్మాత ఆదిత్య చోప్రా తల్లి పమేలా చోప్రా నిన్న కన్నుమూశారు. ఈ సందర్భంగా బాలీవుడ్ సెలెబ్రిటీలందరు ఆదిత్య చోప్రా ఇంటికి వెళ్లి పమేలా చోప్రా ని కడసారి వీక్షించి నివాళులు అర్పించారు.వారిలో కొత్త జంట రణబీర్ కపూర్ మరియు అలియా భట్ కూడా ఉన్నారు.ఈ జంట నిన్న పమేలా చోప్రా భౌతిక కాయానికి నివాళ్లు అర్పించి సాయంత్రం లేట్ గా ఇంటికి వచ్చారు.

ఈ సందర్భంగా ఇంటి వద్ద ఉన్న సీసీటీవీ కెమెరా లో ఒక అరుదైన దృశ్యం బంధింపబడింది.అదేమిటంటే ఇంట్లోకి అడుగుపెట్టే ముందు అలియా భట్ తన చెప్పులను డోర్ వద్ద వదిలి ముందుకు వెళ్తుంది.ఆమె వెనుక నడుస్తున్న రణబీర్ కపూర్ ఇది గమనించి అలియా భట్ చెప్పులను చేతితో పట్టుకొని లోపలకు తీసుకెళ్తాడు.ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.

భర్త అనే అహంకారం ఏమాత్రం లేకుండా భార్య చెప్పులను మోసిన రణబీర్ కపూర్ ని చూసి అమ్మాయిలు ఇలాంటి భర్త మాకు కూడా వస్తే బాగుండును అని సోషల్ మీడియా లో పోస్టులు పెడుతున్నారు.కానీ రణబీర్ ని ద్వేషించే వారు మాత్రం ‘పెళ్ళాం చెప్పులను ఎలా మోస్తున్నాడో చూడండి’ అంటూ వెక్కిలిగా నవ్వుతూ సోషల్ మీడియా లో ట్రోలింగ్ చేస్తున్నారు.

ఏది ఏమైనా ఇప్పుడు రణబీర్ కపూర్ అలియా భట్ చెప్పులను మోసే వీడియో సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది .ఇటీవలే ఈ జంట అభిమానుల సమక్షం లో ముద్దులు పెట్టుకుంటూ ట్రెండింగ్ అయ్యారు.ఇంతలోపే పాపం వీళ్ళ ప్రమేయం లేకుండా మరోసారి ట్రెండ్ అవుతూ ఉన్నారు.అలా సోషల్ మీడియా లో ఈ జంట రోజు ఎదో ఒక విషయం లో ట్రెండింగ్ అవుతూనే ఉన్నారు.