Virupaksha Collections .. అసలు సిసలు కం బ్యాక్ అంటే ఇదే!

- Advertisement -

Virupaksha Collection : మెగా ఫ్యామిలీ లో ఒక హీరో హిట్ కొట్టాడంటే ఇండస్ట్రీ మొత్తం కళకళలాడిపోతాది. చిన్న పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు ప్రతీ ఒక్కరు ఈ హీరోల సినిమాలకు క్యూ కట్టేస్తారు. ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ ‘విరూపాక్ష’ చిత్రానికి కూడా అదే జరుగుతుంది. ఇటీవలే విడుదలైన ఈ థ్రిల్లర్ సినిమాకి బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురుస్తుంది.

Virupaksha Collection
Virupaksha Collection

సమ్మర్ లో సరైన బ్లాక్ బస్టర్ హిట్ లేదు అని బాధపడుతున్న ట్రేడ్ వర్గాలు ‘విరూపాక్ష’ మూవీ వసూళ్లను చూసి ఎంతో సంతృప్తి చెందుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల నుండి ఓవర్సీస్ వరకు ఈ సినిమాకి మొదటి రోజు వచ్చిన ఓపెనింగ్ ని చూసి ట్రేడ్ వర్గాలు సైతం ఆశ్చర్యపోయింది.ఎందుకంటే పెద్దగా హైప్ లేని ఒక మీడియం రేంజ్ హీరో సినిమాకి మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా 6 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు రావడం అనేది సాధారణమైన విషయం కాదు.

ఇక రెండవ రోజు రంజాన్ అవ్వడం తో ఈ సినిమాకి ఉదయం ఆటల నుండే అద్భుతమైన వసూళ్లు వచ్చాయి.ట్రేడ్ వర్గాల లెక్క ప్రకారం ఈ సినిమాకి రెండవ రోజు కేవలం తెలుగు రాష్ట్రాల నుండే 5 కోట్ల 80 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఇది మొదటి రోజు కంటే, ముఖ్యంగా నైజాం ప్రాంతం లో ఈ సినిమాకి రెండవ రోజు సెన్సషనల్ వసూళ్లు నమోదు అయ్యాయని చెపుతున్నారు ట్రేడ్ పండితులు. వాళ్ళ లెక్కల ప్రకారం ఈ సినిమా రెండవ రోజు నైజాం ప్రాంతం లో రెండు కోట్ల 71 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయని.

- Advertisement -

అలా రెండు రోజులకు కలిపి 4 కోట్ల 53 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఇక సీమ ప్రాంతం లో కూడా ఇదే రేంజ్ ఊపు. మొదటి రోజు ఈ ప్రాంతం లో 50 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు రాగ, రెండవ రోజు ఏకంగా 90 లక్షల షేర్ వసూళ్లు వచ్చాయి. అలా మొత్తం మీద రెండవ రోజు ప్రపంచవ్యాప్తంగా విరూపాక్ష సినిమాకి 7 కోట్ల రూపాయలకు పైగా షేర్, రెండు రోజులకు కలిపి సుమారుగా 14 కోట్ల రూపాయిల షేర్ వచ్చిందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here