Chiranjeevi : చిరంజీవితో ఫైటింగ్ కు సిద్ధమైన రామ్ చరణ్ బెస్ట్ ఫ్రెండ్..!

- Advertisement -

Chiranjeevi : వశిష్ఠ దర్శకత్వంలో చిరంజీవి నటించనున్న సినిమా పనులు మొదలయ్యాయి. రెండు రోజుల నుంచి ఈ చిత్రానికి సంబంధించిన ఫొటోలు, వార్తలు సోషల్‌మీడియాలో సందడి చేస్తున్నాయి. తాజాగా పూజా కార్యక్రమాన్ని పూర్తి చేసిన చిత్రబృందం నటీనటుల ఎంపిక పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలు ఎక్స్‌లో షేర్‌ అవుతున్నాయి. సోషియో ఫాంటసీ చిత్రంగా ఇది రానున్న సంగతి తెలిసిందే. మూడు లోకాల చుట్టూ తిరిగే కథ అని టాక్.

Chiranjeevi
Chiranjeevi

దేవ, మానవ, పాతాళలోకాల్లో ఓ పాప చుట్టూ తిరిగే ఫాంటసీ కథట. ఇందులో వీఎఫ్‌ఎక్స్‌ ఎఫెక్ట్స్‌ కూడా భారీ స్థాయిలో ఉండనున్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మించనున్నారట. ఇక ఇందులో విలన్‌గా రామ్ చరణ్ బెస్ట్ ఫ్రెండ్ రానా దగ్గుబాటిని ఎంపిక చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఇక హీరోయిన్‌గా అనుష్క శెట్టి, మృణాల్‌ ఠాకూర్‌ల పేర్లు ఎప్పటినుంచో వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు కీరవాణి స్వరాలు అందిస్తున్నట్లు ఇప్పటికే మూవీ టీమ్ అధికారికంగా ప్రకటించింది.

rana
rana

అలాగే ఈ సినిమా టైటిల్‌ విషయంలోనూ సోషల్‌ మీడియాలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఈ చిత్రానికి ‘విశ్వంభర’ అనే టైటిల్‌ను ఖరారు చేశారట. శంకర్ దర్శకత్వంలో రామ్‌ చరణ్‌ నటిస్తోన్న ‘గేమ్‌ ఛేంజర్‌’కు మొదట ఇదే పేరును పరిశీలించినట్టు అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే, ఆ కథకు విశ్వంభర సరిపోదని దాన్ని పక్కన పెట్టారు. ఇప్పుడు ఇదే టైటిల్‌ను చిరంజీవి సినిమాకు ఫిక్స్‌ చేసినట్లు సమాచారం. చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రాలేదు గానీ మెగా 156 మూవీకి సంబంధించిన ఈ వార్తలు మాత్రం సోషల్‌మీడియాలో ట్రెండ్‌ అవుతున్నాయి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here