Sreelela : శ్రీలీలా మజాకా.. అల్లు అర్జున్, చరణ్​లను వదలట్లేదుగా..?

- Advertisement -

Sreelela : టాలీవుడ్​లో ప్రజెంట్ హాప్పెనింగ్ హీరోయిన్ అంటే టక్కున గుర్తొచ్చే పేరు శ్రీలీల. ఈ బ్యూటీ పెళ్లి సందD మూవీతో టాలీవుడ్​లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది. అయినా ఈ భామకు మాత్రం అవకాశాలు దూసుకొస్తున్నాయి. ఆ సినిమా తర్వాత వరుస అవకాశాలు అందుకుంటూ తెలుగు తెరపై టాప్ గేర్​లో దూసుకెళ్తోంది శ్రీలీల. ధమాకా మూవీతో బ్లాక్ బస్టర్ బంపర్ హిట్ కొట్టి వంద కోట్ల క్లబ్​లో చేరిపోయింది. పాత్ర నిడివితో సంబంధం లేకుండా.. ఫస్ట్, సెకండ్ లీడ్​ అనే బేధం లేకుండా తన తలుపు తట్టిన దాదాపు అన్ని అవకాశాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తోంది. ఒకే సారి డజను సినిమాలు లైన్​లో పెట్టుకుని జెట్ స్పీడ్​లో దూసుకెళ్తోంది. ఓవైపు యంగ్ హీరోలతో జత కడుతూ.. మరోవైపు సీనియర్​ హీరోలతో పోటి పడీ నటిస్తోంది. ఈ బ్యూటీ జోరు చూసి యంగ్ హీరోలు, సీనియర్ నటులు శ్రీలీలే కావాలంటూ డైరెక్టర్లకు, నిర్మాతలకు అల్టిమేటమ్ జారీ చేస్తున్నారట.

శ్రీలీలా
శ్రీలీలా

ఇప్పటికే శ్రీలీల పవన్ కల్యాణ్, బాలకృష్ణ, మహేశ్​బాబు, నితిన్​, రామ్ ​పోతినేని వంటి స్టార్ హీరోల సినిమాల్లో నటించే ఛాన్స్ కొట్టేసింది. ప్రస్తుతం ఆ సినిమాలన్నీ సెట్స్​పై ఉన్నాయి. వరుసగా సినిమా షూటింగుల్లో పాల్గొంటూ క్షణం తీరిక లేకుండా గడుపుతోంది. ఇంకా కొన్ని సినిమాల్లో స్టార్ హీరోయిన్లను సైతం పక్కన బెట్టి దర్శకనిర్మాతలు శ్రీలీలకే జై కొడుతున్నారంటే ఈ అమ్మడుకు ప్రస్తుతం ఉన్న క్రేజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. రీసెంట్​గా గుంటూరు కారం, ఉస్తాద్ భగత్​ సింగ్​లో పూజాహెగ్డే ఉండాల్సిందే.. కానీ ఆ భామను సైడ్ చేసి ఆ పాత్రల్లో శ్రీలీలను తీసుకున్నారు.

శ్రీలీల

ఇప్పటికే డజను ఛాన్సులను చేతిలో పెట్టుకున్న శ్రీలీల ఫోకస్ ఇప్పుడు గ్లోబల్ స్టార్లు, పాన్ ఇండియా హీరోల మీద పడిందట. ఏకంగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్​ కూడా శ్రీలీలపై ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లు టాక్. శంకర్​ తెరకెక్కిస్తున్న ‘గేమ్​ఛేంజర్​’లో చరణ్ నటిస్తున్న సంగతి తెలిసిందే. దీని తర్వాత ఆయన ఉప్పెన ఫేమ్​ బుచ్చిబాబుతో కలిసి ఓ స్పోర్ట్స్ బ్యాక్​గ్రౌండ్ సినిమా చేయనున్నారు. ఆ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్​ను హీరోయిన్​గా ఎంపిక చేసినట్టు అప్పట్లో టాక్ వినిపించింది. కానీ తాజాగా ఆ ఛాన్స్ శ్రీలీలకు వచ్చినట్లు తెలిసింది. రామ్​ చరణ్ కూడా శ్రీలీల పేరును సజెస్ట్ చేశాడట.

- Advertisement -

ఇక శ్రీలీల పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్​ సినిమాలోనూ నటించే అవకాశం కొట్టేసిందట. ఇప్పటికే పుష్ప-2, త్రివిక్రమ్​ దర్శకత్వంలో వస్తున్న మరో సినిమా పనుల్లో బన్నీ బిజీగా ఉన్నాడు. అయితే త్రివిక్రమ్ దర్శకత్వంలో వస్తున్న సినిమాలో హీరోయిన్​గా విరూపాక్ష ఫేమ్ సంయుక్తను తీసుకోబోతున్నట్లు టాక్ వినిపించింది. ఇప్పుడు ఆ బ్యూటీని పక్కన పెట్టేసి శ్రీలీలకు జై కొట్టినట్లు తెలుస్తోంది. ఇదే నిజమైతే శ్రీలీల ఇద్దరు పాన్ ఇండియా స్టార్ల సినిమాల్లో నటించే ఛాన్స్ కొట్టేసినట్టే.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here