Rana Daggubati : సినిమాల్లో బిజీ గా ఉంటూనే వ్యాపార రంగం లో కూడా గొప్పగా రాణించిన హీరోలు మన ఇండస్ట్రీ లో చాలా మంది ఉన్నారు. వారిలో ఒకరు దగ్గుపాటి రానా. ఈయన బాబాయ్ విక్టరీ వెంకటేష్ ఒక పెద్ద స్టార్ హీరో అయ్యినప్పటికీ, ఆయన తండ్రి సురేష్ బాబు , అలాగే తాతయ్య రామానాయుడు ఇండస్ట్రీ లో టాప్ మోస్ట్ నిర్మాతలలో ఒకరు. రానా కూడా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టక ముందు నుండే పలు వ్యాపారాల్లో తలదూర్చాడు.
ఆయన సినిమాల్లోకి ముందుగా హీరో అవ్వాలని రాలేదు. విదేశాల్లో గ్రాఫిక్స్ డిజైన్స్ నేర్చుకొని , ఇండియా కి వచ్చి స్పిరిట్ ఇండియా అనే ఒక వీ ఎఫ్ ఎక్స్ కంపెనీ ని స్థాపించాడు. ఈ కంపెనీ స్థాపించినప్పుడు ఆయన వయస్సు కేవలం 18 సంవత్సరాలు మాత్రమే. ఈ కంపెనీ ద్వారా ఆయన ఎన్నో సినిమాలకు వీ ఎఫ్ ఎక్స్ డిజైన్స్ చేసాడు.
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా నటించిన ‘సైనికుడు’ చిత్రం కి వీ ఎఫ్ ఎక్స్ ఎఫెక్ట్స్ మొత్తం క్రియేట్ చేసింది ఈ కంపెనీనే. అయితే రానా ఇప్పుడు ఈ కంపెనీ ని మైంటైన్ చెయ్యలేక అమ్మేసాడట. ఆయన మాట్లాడుతూ ‘ ఎప్పటికైనా ఈ స్టూడియో పేరు మీద సినిమాలను తియ్యాలని అనుకున్నాను, కానీ అది జరగలేదు. బాహుబలి సినిమా నుండి గ్రాఫిక్స్ వర్క్స్ లో లేటెస్ట్ టెక్నాలజీ ని వాడడం మన ఇండియన్ సినిమా మొదలు పెట్టింది. అది చాలా ఖర్చు తో కూడుకున్నది. మనం అంత పెట్టలేం, పెట్టినా లాభాలు రావు, అందుకే ఈ కంపెనీ ని ప్రైమ్ ఫోకస్ అనే సంస్థ కి అమ్మేసాను. ఇది ప్రపంచం లోనే అది పెద్ద విజువల్ ఎఫెక్ట్స్ కంపెనీలలో ఒకటి’ అంటూ చెప్పుకొచ్చాడు రానా. ఆయన చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.