బాలీవుడ్‌, మాలీవుడ్‌వైపు రానా పరుగులు.. దాని కోసమేనా?

- Advertisement -

టాలీవుడ్‌ ప్రముఖ నిర్మాత సురేశ్‌ బాబు కుమారుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు రానా. భిన్నమైన కథలను ఎంచుకుంటూ వైవిధ్యభరితమైన హీరోగా ఎదిగారు. రానా ఇప్పటికే రానానాయుడు వెబ్‌సిరీస్‌తో ఓటీటీలోనూ తన సత్తా చూపించారు. ఇక రానా తాజాగా బాలీవుడ్‌, మాలీవుడ్‌ వైపు పరుగులు తీస్తున్నారు. అయితే అది నటుడిగా కాక, నిర్మాతగా సక్సెస్‌ అవ్వాలని చూస్తున్నారట.

రానా
రానా

రానా, బాలీవుడ్‌ హీరో వరుణ్‌ ధావన్‌ల కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కేందుకు రంగం సిద్ధమౌతున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఈ సినిమాలో రానా, వరుణ్‌ ధావన్‌ హీరోలుగా నటించడం లేదు. వరుణ్‌ ధావన్‌ హీరోగా రానా ఈ సినిమాను నిర్మించబోతున్నారట. ఈ చిత్రం నిర్మాణంలో రానాతో పాటు సునీల్‌ నారంగ్‌ కూడా భాగస్వామ్యులు అవుతారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాకు ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వం వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై అధికారిక సమాచారం రావాల్సి ఉంది.

Rana daggubati

అలాగే మలయాళ హీరో దుల్కర్‌ సల్మాన్‌తో రానా ఓ సినిమాను నిర్మించనున్నారని సమాచారం. ఇలా గతంలోనూ రానా పలు సినిమాలకు నిర్మాతగా ఉన్న సంగతి తెలిసిందే. ఒకవైపు నటుడిగా మరోవైపు నిర్మాతగా బిజీగా ఉంటున్నారు రానా. వైవిద్యమైన కథలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తూనే అటు నిర్మాతగానూ కొనసాగాలని చూస్తున్నారట. ఇక రానా తాజాగా ఓ ఇంటర్వ్యూలో ప్రొడక్షన్‌పై కొన్ని వ్యాఖ్యలు చేశారు. ‘‘నేను నటుడిని కాక ముందు పెద్ద సవాలును ఎదుర్కొన్నాను.

- Advertisement -

నిర్మాతగా మారాలా.. లేదంటే నటుడిని అవ్వాలా.. అని చాలా ఆలోచించాను. 2005లో మొదటిసారి నిర్మాతగా మారి ‘బొమ్మలాట’ అనే సినిమాను తీశాను. దానికి రెండు జాతీయ అవార్డులు వచ్చాయి. కానీ, ఆ సినిమా ప్రేక్షకాదరణ పొందలేదు. చిన్న సినిమాలు విడుదలవ్వాలంటే ఎంత కష్టపడాలో అప్పుడే అర్థం చేసుకున్నాను. నాకు నచ్చిన కొన్ని కథలను తెరకెక్కించాలని ఎంతోమంది దర్శకులను, టెక్నిషియన్స్‌ను కలిశాను. కొత్త కథలను తీసుకురావాలంటే సినీ పరిశ్రమలో ఎంతో కష్టమని అర్థం చేసుకున్నాను. అందుకే యాక్టర్‌ని అయ్యాను’’ అని తెలిపారు.

బాహుబలి చిత్రంతో పాన్‌ ఇండియా రేంజ్‌లో గుర్తింపు తెచ్చుకున్న రానా ప్రస్తుతం హీరోగా ‘రాక్షసరాజు’ (వర్కింగ్‌ టైటిల్‌) సినిమా చేస్తున్నారు. ‘నేనే రాజు నేను మంత్రి’ చిత్రం తర్వాత దర్శకుడు తేజ – రానా కాంబినేషన్‌లో రూపొందనున్న ఈ చిత్రం షూటింగ్‌ త్వరలో ప్రారంభం కానుంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

   
vps230225.betterwebtechnologies.com telugucinematoday.com