సెన్సేషనల్ రెస్పాన్స్ దక్కించుకుంటున్న ‘రామ్ సీత రామ్’ పాట.. ఆది పురుష్ సినిమా నుండి మరో చార్ట్ బస్టర్!

- Advertisement -

యావత్తు భారత దేశ సినీ ప్రియులందరూ ఇప్పుడు ప్రభాస్ హీరో నటించిన ‘ఆదిపురుష్’ మూవీ కోసం ఎంతో ఆత్రుతతో ఎదురు చూస్తున్నారు. వచ్చే నెల 16 వ తారీఖున విడుదల అవ్వబోతున్న ఈ సినిమా కి సంబంధించిన ప్రమోషనల్ కంటెంట్ కి ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది.

రామ్ సీత రామ్
రామ్ సీత రామ్

రీసెంట్ గా విడుదల చేసిన ట్రైలర్, అంతకు ముందు విడుదల చేసిన ‘జై శ్రీరామ్’ టైటిల్ సాంగ్ రెండు కూడా తెలుగు ఆడియన్స్ తో పాటుగా హిందీ ఆడియన్స్ ని కూడా ఆకట్టుకుంది. ఇక ఈరోజు ‘రామ్ సీత రామ్’ సాంగ్ ని విడుదల చేసారు. దీనిని లిరికల్ వీడియో సాంగ్ అని పిలవడం కంటే కూడా వీడియో సాంగ్ అని పిలవొచ్చు. సినిమాలోని కొన్ని కీలక సన్నివేశాలను ఈ సాంగ్ లో చూపించారు. విజువల్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి.

ఈ విజువల్స్ లో శ్రీ రాముని పాత్ర పోషించిన ప్రభాస్ సీతతో మాట్లాడుతూ ‘నువ్వు రాజకుమారివి సీత..నువ్వు ఉండాల్సింది రాజభవనంలో’ అని అంటాడు. అప్పుడు సీత ‘నా రాఘవుడు ఎక్కడ ఉంటే అదే నా రాజభవనం’ అని అంటుంది. అక్కడి నుండి ప్రారంభమైన ఈ పాట లో రామాయణ ఘట్టాలన్నిటిని చూపిస్తారు. ఆ విజువల్స్ చూడడానికి ఎంతో సహజం గా ఉంది.

- Advertisement -

రామ సేతు నిర్మాణం కి సంబంధించిన సన్నివేశాలతో పాటుగా, శ్రీ రాముడి తన అంగుళీకం ని హనుమంతుడికి ఇచ్చి సీతకి చేర్చడం, సీత నుండి వచ్చే సందేశం ని హనుమంతుడు శ్రీరామునికి చేర్చడం వంటి సన్నివేశాలు చాలా సహజం గా ఉండేటట్టు తీసాడు డైరెక్టర్ ఓం రౌత్. ఆయన ఎందుకు విజువల్ ఎఫెక్ట్స్ కోసం ఇంత ప్రత్యేకమైన శ్రద్ద తీసుకున్నాడు అనేది ఈ సాంగ్ ని చూస్తే అర్థం అయిపోతుంది. ‘జై శ్రీరామ్’ పాటలాగానే ఈ పాట కూడా ఆడియన్స్ కి బాగా రీచ్ అయ్యే ఛాన్స్ ఉందని అంటున్నారు ట్రేడ్ పండితులు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here