Ram Pothineni : టాలీవుడ్ లో ప్రస్తుతం ఉన్న కుర్ర హీరోలలో రామ్ పోతినేని కి యూత్ మరియు మాస్ ఆడియన్స్ లో ఉన్న క్రేజ్ వేరు.అతని ఎనెర్జిటిక్ యాక్టింగ్ కి ఎవరైనా చాలా తేలికగా కనెక్ట్ అయిపోతారు.ప్రముఖ నిర్మాత స్రవంతి రవి కిషోర్ కుమారుడిగా ఇండస్ట్రీ కి ‘దేవదాసు’ అనే చిత్రం ద్వారా పరిచయమైనా హీరో రామ్ ఖాతాలో ఒక అరుదైన ప్రపంచ రికార్డు ఉంది.ఇప్పటి వరకు ఏ హీరో కి కూడా అది సాధ్యపడలేదు.
అదేమిటంటే రామ్ తనకి కేవలం 15 ఏళ్ళ వయస్సు ఉన్నప్పుడు ‘దేవదాసు’ సినిమాలో హీరోగా నటించడానికి సైన్ చేసాడు.9 వ తరగతి పూర్తి అవ్వగానే దేవదాసు సినిమాకి ఒప్పుకున్నానని ఆయన అనేక ఇంటర్వ్యూస్ లో చెప్పాడు కూడా.అంత చిన్న వయస్సులో మెయిన్ లీడ్ హీరో గా అడుగుపెట్టిన వాళ్ళు అంతకు ముందు ఇండస్ట్రీ లో ఎవ్వరూ లేరు.
అలా 15 ఏళ్లకే సినిమాల్లో హీరోగా ఎంట్రీ ఇవ్వడమే కాదు, ఆ చిత్రం తోనే ఆరోజుల్లో ఆయన కలెక్షన్స్ పరంగా 18 కోట్ల రూపాయిల షేర్ ని కొల్లగొట్టాడు.అంతే కాకుండా ఆరోజుల్లో ఈ సినిమా 17 కేంద్రాల్లో 175 రోజులు ఆడింది, హైదరాబాద్ లోని ‘ఒడియన్’ థియేటర్ లో అయితే 200 రోజులకు పైగా ఆడింది. ఇలాంటి సెన్సేషనల్ రికార్డు 15 ఏళ్ళ వయస్సులో ఇండియాలోనే కాదు, ప్రపంచం లో కూడా ఎవరికీ లేదని చెప్పడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు. తొలి సినిమాతోనే తన ఎనర్జీ , డైలాగ్ డెలివరీ, యాక్టింగ్, కామెడీ టైమింగ్ , డ్యాన్స్ మరియు ఫైట్స్ ఇవన్నీ చూసి ‘ఎవరీ పిల్లాడు..చిచ్చర పిడుగులాగా ఉన్నాడు.
భవిష్యత్తులో పెద్ద స్టార్ అవుతాడు’ అని అనుకునేవాళ్లు. వాళ్ళు ఊహించినట్టు పెద్ద స్టార్ అయితే కాలేదు కానీ, మీడియం రేంజ్ హీరోస్ లో నెంబర్ 1 గా నిలిచాడు.కెరీర్ లో మంచి బ్లాక్ బస్టర్ హిట్స్ ఉన్నప్పటికీ, మధ్యలో సరైన సూపర్ హిట్స్ పడకపోవడం వల్ల స్టార్ స్టేటస్ కి చేరుకోలేకపొయ్యాడు రామ్ పోతినేని. ప్రస్తుతం ఆయన బోయపాటి శ్రీను తో ఒక సినిమా చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమా హిట్ అయితే కచ్చితంగా రామ్ స్టార్ హీరోల లీగ్ లోకి అడుగుపెడుతాడని ఆయన అభిమానులు ఆశిస్తున్నారు, చూడాలిమరి ఈ సినిమా వాళ్ళ అంచనాలను అందుకుంటుందా లేదా అనేది.