#RRR చిత్రం తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సౌత్ ఇండియన్ సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ తో సినిమా చేస్తున్నాడని ఫ్యాన్స్ ఎంతలా మురిసిపోయారో మన అందరికీ తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన ప్రతీ విషయాన్నీ ఒక పండుగలాగా చేసుకుందాం అని ఆశపడ్డారు. ఇప్పటి వరకు కేవలం ఫస్ట్ లుక్ మరియు టైటిల్ వీడియో తప్ప ఇప్పటి వరకు ఈ సినిమా నుండి ఒక్క కంటెంట్ కూడా విడుదల కాలేదు.

దీనిపై రామ్ చరణ్ ఫ్యాన్స్ చాలా ఫైర్ అయ్యారు,ట్విట్టర్ లో దిల్ రాజు ని ట్యాగ్ చేస్తూ మొన్న నేషనల్ వైడ్ గా ట్రెండ్ చేసారు. అయినా కూడా మూవీ టీం నుండి ఎలాంటి స్పందన రాలేదు. మరో విషయం ఏమిటంటే ఈ సినిమా సమ్మర్ కి కూడా రావడం లేదట. ముందుగా వచ్చే ఏడాది సంక్రాంతి కి విడుదల చేద్దాం అనుకున్నాడు నిర్మాత దిల్ రాజు.

అనుకున్న ప్రకారం షెడ్యూల్స్ ని పూర్తి చేసి ఉంటే కచ్చితంగా సంక్రాంతికి వచ్చేదే, కానీ అదే సమయం లో శంకర్ ‘ఇండియన్ 2’ కూడా సమాంతరంగా షూటింగ్ చెయ్యాల్సిన అవసరం రావడం తో ‘గేమ్ చేంజర్’ చిత్రం బాగా ఆలస్యం అయిపోయింది. ఇంకా ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ 80 రోజులు బ్యాలెన్స్ ఉంది అట.

దానికి తోడు ఇప్పుడు కియారా అద్వానీ గర్భవతి అయ్యిందని, ప్రస్తుతం ఆమె డేట్స్ అన్నీ ఒక హిందీ సినిమా కోసం కేటాయించిందని, ఆమె గర్భవతి అవ్వడం తో వల్ల, ముందుగా ఆమెకి సంబంధించిన సన్నివేశాలను వెంటనే షూటింగ్ చేసి పూర్తి చెయ్యాలనే ఆలోచనలో ఉందట టీం. కానీ ఆమె డేట్స్ ఇవ్వడం లేదు, అందుకే షూటింగ్ మళ్ళీ తిరిగి ప్రారంభం కాలేదని ఇండస్ట్రీ లో వినిపిస్తున్న మాట. ఒకవేల కియారా అద్వానీ కి ఆరు నెలలు నిండితే మాత్రం , ఇప్పట్లో ఆమె ‘గేమ్ చేంజర్‘ సినిమాకి డేట్స్ ఇచ్చే అవకాశమే లేదు, ఇదే ఇప్పుడు పెద్ద సమస్య గా మారింది. మరి దీనిని మేకర్స్ ఎలా ఎదురుకుంటారో చూడాలి.
