రామ్ చరణ్ కూతురికి ఆ స్టార్ హీరోయిన్ పేరు పెట్టబోతున్నారా..? ఇది మామూలు ట్విస్ట్ కాదుగా!

- Advertisement -

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు ఉపాసనలకు ఈరోజు ఉదయం తెల్లవారు జామున ఆడ బిడ్డకు జన్మని ఇచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. మెగా ఫ్యామిలీ కుటుంబ సభ్యులు మరియు అభిమానులు రాష్ట్ర వ్యాప్తంగా ఈ సందర్భాన్ని పండుగలాగా జరుపుకుంటున్నారు. సుమారుగా మెగా ఫ్యాన్స్ పదేళ్ల నిరీక్షణకు తెరదించుతూ మెగాస్టార్ చిరంజీవి గత ఏడాది అభిమానులతో ఈ విషయాన్నీ పంచుకున్నప్పటి నుండి ఇప్పటి వరకు ఎప్పుడెప్పుడు బిడ్డ పుట్టింది అనే వార్త వింటామా, మగ బిడ్డ బిడ్డ పుట్టబోతుందా, ఆడ బిడ్డ పుట్టబోతుందా అని ఎంతో ఆత్రుతతో ఎదురు చూసారు.

రామ్ చరణ్
రామ్ చరణ్

ఇక పోతే ఇండస్ట్రీ కి చెందిన ప్రతీ ఒక్కరు కూడా రామ్ చరణ్ కి శుభాకాంక్షలు తెలియచేసారు. ఈరోజు ఉదయం తెల్లవారు జామున డెలివరీ జరిగిన వెంటనే చిరంజీవి హాస్పిటల్ కి వచ్చి చూసి వెళ్ళాడు. ఇక కాసేపటి క్రితమే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన సతీమణి స్నేహ రెడ్డి తో కలిసి అపోలో హాస్పిటల్స్ కి వచ్చి మెగా వారసురాలిని చూసి వెళ్లారు.

Ram charan upasana

ఇలా ఎక్కడ చూసిన సంబరాల్లో మునిగి తేలుతున్నారు కుటుంబ సభ్యులు మొత్తం, ఇది ఇలా ఉండగా రామ్ చరణ్ తన కూతురుకి పెట్టబోతున్న పేరు ఇదేనంటూ సోషల్ మీడియా లో ఒక వార్త జోరుగా ప్రచారం సాగుతుంది. మెగా కుటుంబం లో ఉన్న వాళ్లందరికీ దైవ నామాలే పెడుతూ వచ్చారు. ఎక్కువ మహా శివుడు మరియు ఆంజనేయ స్వామి పేర్లు వచ్చే విధంగానే ఉంటుంది.

- Advertisement -
ram charan upasan

కానీ రామ్ చరణ్ మాత్రం తన కూతురుకి అంజలి అనే పేరు పెట్టబోతున్నట్టుగా తెలుస్తుంది. ‘అంజలి’ దేవుడికి ప్రార్థన చెయ్యడం, ఈ పేరు అంటే రామ్ చరణ్ మొదటి నుండి ఎంతో ఇష్టమట. ఇదే పేరు తో సౌత్ లో అంజలి అనే స్టార్ హీరోయిన్ కొనసాగుతున్న సంగతి అందరికీ తెలిసిందే. మరి ఇందులో ఎంత మాత్రం నిజం ఉందో చూడాలి. ప్రస్తుతం ఉపాసన అపోలో హాస్పిటల్ లోనే తన బిడ్డతో కలిసి అబ్సెర్వేషన్ లో ఉంది, ఈరోజు సాయంత్రం లోపు డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here