జై ఎన్టీఆర్ మహానటుడు/ ఆంధ్ర ప్రదేశ్ రాత్రి మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు జన్మించి 100 ఏళ్ళు పూర్తి అయ్యింది. కొంతకాలం క్రితమే విజయవాడ లోని కైకలూరు ప్రాంతం లో ఘనంగా 100 ఏళ్ళ పండుగ ని నిర్వహించారు. ఈ ఫంక్షన్ కి సూపర్ స్టార్ రజినీకాంత్ ముఖ్య అతిథి గా హాజరయ్యాడు. ఇప్పుడు అదే ఫంక్షన్ హైదరాబాద్ లో కనీవినీ ఎరుగని రీతిలో చేసారు.
ఈ ఫంక్షన్ కి పవన్ కళ్యాణ్ , ప్రభాస్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ మరియు రామ్ చరణ్ ఇలా టాలీవుడ్ స్టార్ హీరోలందరినీ ఆహ్వానించగా ఒక్క రామ్ చరణ్ తప్ప అందరూ డుమ్మా కొట్టేసారు.ఈ ఈవెంట్ ని కండక్ట్ చేసిన శ్రేయాస్ మీడియా హీరోలందరూ వస్తారనే ఉద్దేశ్యం తో గ్రాండ్ గా ప్లాన్ చేసారు, వాళ్ళు రాకపోవడం తో ఈవెంట్ మ్యానేజర్స్ కి బాగా నష్టం అయ్యినట్టు సమాచారం.
ఇక ఈ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా వచ్చిన రామ్ చరణ్ ఇచ్చిన ప్రసంగం ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. ముఖ్యంగా ఎన్టీఆర్ గురించి ఆయన మాట్లాడిన ప్రతీ మాట నందమూరి ఫ్యాన్స్ హృదయాలను కొల్లగొట్టింది. ఆయన మాట్లాడుతూ ‘ఇప్పుడు మనం తెలుగు సినిమా పాన్ వరల్డ్ రేంజ్ కి వెళ్లిందని గర్వ పడుతున్నాము. కానీ మనం పుట్టకముందే ఆ మహానుభావుడు మన తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచం నలుమూలల విస్తరింపచేసాడు. అలాంటి లెజెండ్ పుట్టిన ఇండస్ట్రీ లో పనిచేస్తున్నందుకు నేను గర్వపడుతున్నాను’.
ఇంకా ఆయన మాట్లాడుతూ ‘ఆయనని నేను ఎక్కువ సార్లు కలవలేదు కానీ, పురందేశ్వరి ఆంటీ అబ్బాయి కారణంగా ఒకే ఒక్కసారి ఆ మహానుభావుడి ని కలిసే అదృష్టం దొరికింది. నేను పురాధీశ్వరీ ఆంటీ అబ్బాయి స్కెటింగ్ క్లాసులకు వెళ్తూ ఉండేవాళ్ళం. ఒక రోజు ఆ అబ్బాయి మా తాత గారికి దగ్గరకి వెళ్తున్న వస్తావా అన్నాడు, అప్పుడు ఎన్టీఆర్ గారు సీఎం గా పనిచేస్తున్నారు అనుకుంట. ఉదయాన్నే ఇంటికి వెళ్ళాను, ఆయన తన వర్కౌట్స్ చేసుకొని బ్రేక్ ఫాస్ట్ చెయ్యడానికి సిద్ధం గా ఉన్నాడు. ఆయనతో పాటు తనని కూడా కూర్చోపెట్టుకొని బ్రేక్ ఫాస్ట్ చేయించాడు, ఇదే నాకు కల్గిన అద్భుతమైన అవకాశం.ఇలాంటి గొప్ప ఫంక్షన్ కి నన్ను పిల్చినందుకు బాలయ్య గారికి , చంద్రబాబు నాయుడు గారికి కృతఙ్ఞతలు తెలియచేస్తున్నాను,జై ఎన్టీఆర్’ అంటూ రామ్ చరణ్ వ్యాఖ్యానించాడు.