World Cup 2023 : వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో సూపర్ స్టార్ రజినీకాంత్ తో కలిసి సందడి చేయనున్న రామ్ చరణ్!

- Advertisement -

World Cup 2023 : వరల్డ్ కప్ టోర్నమెంట్ లో ఇండియా దూకుడు ఏ రేంజ్ లో కొనసాగుతూ ముందుకు పోతుందో మనమంతా చూస్తూనే ఉన్నాం. ప్రత్యర్థులకు మన టీం ని చూస్తే వెన్నుల వణుకు పుట్టేలా చేసింది ఈ టోర్నమెంట్. సెమిస్ లో న్యూజిల్యాండ్ పై ఘణ విజయం సాధించిన ఇండియన్ టీం, రేపు ఆస్ట్రేలియా తో ఫైనల్స్ లో తుది పోరుకి సిద్ధం అవుతుంది. ఈ పోరు లో ఎవరు గెలుస్తారు అనేది అందరిలో ఉత్కంఠ నెలకొంది.

World Cup 2023
World Cup 2023

2003 వ సంవత్సరం లో మన టీం ఆస్ట్రేలియా చేతిలో ఘోరమైన ఓటమిని చవి చూసింది. ఈ ఓటమి ని ఇప్పటికీ తల్చుకున్న ఏడుపు వచేస్తాది. అందుకే ఈసారి ఆసీస్ పై ఘన విజయం సాధించి ప్రతీకారం తీర్చుకోవడానికి కసరత్తులు చేస్తుంది ఇండియన్ టీం. రేపటి మ్యాచ్ కోసం సామాన్య ఆడియన్స్ మాత్రమే కాదు, ప్రముఖ సెలబ్రిటీస్ అందరూ ఎంతో ఆత్రుతతో ఎదురు చూస్తున్నారు.

World Cup 2023 IND vs Aus

ఇదంతా పక్కన పెడితే ఈ అహమ్మదాబాద్ లో జరగబోయే ఈ మ్యాచ్ కి సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజినీకాంత్, అలాగే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కూడా హాజరు కాబోతున్నారు. వీరితో పాటుగా విక్టరీ వెంకటేష్, నాగార్జున, మమ్ముటి మరియు కమల్ హాస్సన్ వంటి స్టార్ హీరోలు కూడా హాజరు కాబోతున్నారట. వీళ్లంతా రేపు జరగబొయ్యే మ్యాచ్ స్టేడియం లో కూర్చొని అభిమానులతో కలిసి మ్యాచ్ ఎంజాయ్ చెయ్యబోతున్నారు.

- Advertisement -
Rajinikanth Ram Charan
Worldcup 2023

ఇకపోతే మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని కూడా ఈ మ్యాచ్ లో పాల్గొనబోతున్నట్టు తెలుస్తుంది. ఇలా ఇంత మంది ఇన్ని ఆశలు పెట్టుకున్న ఈ మ్యాచ్ ని మనం గెలుస్తామో లేదో అనేది మరి కొద్దీ గంటల్లోనే తెలియనుంది. మరో విశ్వసనీయ సమాచారం ఏమిటి అంటే ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కూడా ఈ మ్యాచ్ వీక్షించేందుకు విచ్చేస్తున్నారట.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here