Sara Tendulkar : సచిన్ టెండూల్కర్ కూతురితో రామ్ చరణ్ రొమాన్స్.. ఫ్యాన్స్ కి ఫ్యూజులు ఎగిరిపోయే న్యూస్!

ram charan


Sara Tendulkar : ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ సూపర్ స్టార్ ఇమేజి ని సొంతం చేసుకున్న అతి తక్కువ మంది తెలుగు హీరోలలో ఒకరు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. మగధీర నుండే ఆయన పాన్ ఇండియా లెవెల్ లో పాపులారిటీ ని సంపాదించాడు. కానీ #RRR చిత్రం తో పాన్ వరల్డ్ రేంజ్ కి చేరుకున్నాడు. ప్రస్తుతం ఆయన సౌత్ ఇండియన్ సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ తో ‘గేమ్ చేంజర్’ అనే సినిమా చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.

Sara Tendulkar
Sara Tendulkar

ఈ సినిమా తర్వాత ఆయన ఉప్పెన డైరెక్టర్ బుచ్చి బాబు తో ఒక సినిమా, అలాగే బాలీవుడ్ లో ఒక క్రేజీ ప్రాజెక్ట్ కి సైన్ చేసాడు. 3 ఇడియట్స్ , పీకే, సంజు , మున్నా భాయ్ ఎంబీబీఎస్ వంటి సంచలనాత్మక చిత్రాలను తీసిన రాజ్ కుమార్ హిరానీ తో రామ్ చరణ్ ఒక సినిమా ఒప్పుకున్నాడు.

Ram Charan

ఈ సినిమా వచ్చే ఏడాది లో ప్రారంభం కాబోతుంది. అయితే ఈ చిత్రం లో కొత్త హీరోయిన్ ని పరిచయం చెయ్యడానికి చూస్తున్నారట మూవీ టీం. కథకి మరియు కంటెంట్ కి తగ్గట్టుగా ఈ సినిమాలో ఇప్పటి వరకు పరిచయం లేని హీరోయిన్ ముఖం కావాలట. చాలా రోజుల నుండి సచిన్ టెండూల్కర్ కూతురు సరా టెండూల్కర్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వాలని చూస్తుంది.

Ram Charan Latest Movie

రాజ్ కుమార్ హిరాణితో పలుసార్లు సచిన్ ప్రత్యేకంగా దీనిపై చర్చలు కూడా జరిపాడట. తన దగ్గర సరైన కథ కుదిరినప్పుడు కచ్చితంగా చేస్తానని మాట ఇచ్చాడట రాజ్ కుమార్ హిరానీ. అందుకే ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో సరా టెండూల్కర్ ని తీసుకోబోతున్నట్టు బాలీవుడ్ వర్గాల్లో జోరుగా వినిపిస్తున్న వార్త. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఒకవేళ అదే నిజం అయితే బాలీవుడ్ లో ఈ చిత్రానికి ఆకాశమే హద్దు అని చెప్పొచ్చు.