Nani : రాజకీయాల్లోకి నాని.. ఏకంగా ఫోటోతోనే కన్ఫర్మ్ చేసేసాడా…

- Advertisement -

Nani : నాని ఓ సినిమా కోసం ఎంతలా కష్టపడతాడంటే సినిమా ఒప్పుకున్నామా, షూటింగ్ కంప్లీట్ చేశామా అన్నట్టు కాకుండా ఆ సినిమాని విడుదలయ్యేంత వరకు తన భుజాలపై మోస్తాడు. చాలా వెరైటీగా సినిమాని ప్రమోట్ చేస్తుంటాడు. ఈ యంగ్ జనరేషన్ హీరోల్లో ఓ సినిమాని ప్రమోట్ చేయాలంటే నాని తర్వాతే ఎవరైనా అని చెప్పొచ్చు. అలా ఇప్పటికే తాను నటించిన ‘హాయ్ నాన్న’ ప్రమోషన్స్ ఓ రేంజ్ లో సాగుతున్నాయి.

ఇందులో భాగంగా ఫోటోను షేర్ చేసిన నాని.. “ఇది ఎలక్షన్ మూడ్. ఇందులో మనం ఎందుకు జాయిన్ కాకూడదు. డిసెంబర్ 7న మీ ప్రేమ, ఓటు మాకే అవ్వాలని, మీ హాయ్ నాన్న పార్టీ ప్రెసిడెంట్ విరాజ్” అంటూ రాస్కొచ్చాడు. ఈ పోస్ట్ చూసిన ఫ్యాన్స్.. “నాని అన్న పొలిటికల్ గెటప్ లో అదిరిపోయాడు”,  “చివరికి ఎలక్షన్స్ ని కూడా సినిమా ప్రమోషన్ కోసం వాడుకున్నావంటే నువ్వు గ్రేట్ అన్నా”, “నీ డెడికేషన్ కి హ్యాట్సాఫ్ నాని అన్నా” అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

ఇప్పటికే మూవీ నుంచి బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్ విడుదలై ఆడియన్స్ నుంచి విశేష స్పందన అందుకుంది. ఈ మూవీ నుంచి ఒక్కో పాటను విడుదల చేసే ముందు నాని అందుకు తగ్గట్టు ముందు స్పెషల్ వీడియోస్ రిలీజ్ చేసి ఆ తర్వాత సాంగ్స్ రిలీజ్ చేశాడు. ఎన్నడూ లేని విధంగా ‘హాయ్ నాన్న’ కోసం నాని ప్రమోషనల్ స్టైల్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. తాజాగా ఎలక్షన్స్ ని సైతం తన సినిమా ప్రమోషన్ కోసం వాడుకున్నాడు నాని. తన సోషల్ మీడియా వేదికగా నాని ఓ ఫోటోని షేర్ చేశాడు. అందులో పొలిటికల్ గెటప్ తో ఉన్న నానిని చూసి ముందు అందరూ షాక్ అయ్యారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here