వరుణ్ తేజ్‌కి ఆ విషయంలో సలహాలు ఇచ్చేది రామ్ చరణేనట !

- Advertisement -

ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజబుల్ హీరోలలో వరుణ్ తేజ్ ఒకరు. సెలక్టివ్ గా సినిమాలు చేసుకుంటూ తనకంటూ ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. తొలి సినిమా ముకుంద సినిమాతోనే తనలో మంచి నటుడు ఉన్నాడని నిరూపించుకున్నాడు. ఆ తర్వాత అటు క్లాస్ ఇటు మాస్ సినిమాలు చేస్తూ మంచి విజయాలు అందుకుంటున్నాడు. ప్రజెంట్ టాలీవుడ్ ఇండస్ట్రీలో కామెడీ టైమింగ్ ఉన్న హీరో వరుణ్. తన చివరి చిత్రంలో ఎఫ్ 3 సినిమాలో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాడు. ఇక ప్రస్తుతం వరుణ్ తేజ్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో గాండీవధారి అర్జున సినిమాలో నటిస్తున్నారు. దీని తర్వాత శక్తి ప్రతాప్ సింగ్ డైరక్షన్లో వరుణ్ తన 13వ చిత్రాన్ని ప్రకటించాడు. ఆ సినిమాకు ఆపరేషన్ వాలంటైన్ అనే టైటిల్ ఖరారు చేసింది యూనిట్.

వరుణ్ తేజ్‌
వరుణ్ తేజ్‌

ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న వరుణ్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. వ‌రుణ్ మాట్లాడుతూ కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. ఇంటర్వ్యూలో భాగంగా వరుణ్ తన కెరీర్లో ఏడవ సినిమా పూర్తయిన వెంటనే రామ్ చరణ్ తనకు ఫోన్ చేసినట్లు చెప్పాడు. ఫోన్లో చెర్రీ అన్న మాట్లాడుతూ యూనిక్ కంటెంట్ ఉన్న కథలను ఎంచుకోమని.. మన చుట్టూ ఉన్న వ్యక్తుల మార్కెట్ ని దృష్టిలో పెట్టుకొని సేఫ్ గా కథల వైపు అడుగులు వేయాలని.. కొన్ని కొత్త ప్రయోగాలు చేసేటప్పుడు ముందుగా ఓ సారి ఆలోచించుకోవాలని సలహా ఇచ్చాడు. ఒక వేళ కొత్త కథలను ఎంచుకుంటే నీకు ఓ స్పెషల్ ఐడెంటిటీ ఉండే అంశాలున్న మూవీనే ఎంచుకోవాలని చెప్పినట్లు తెలిపాడు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here