Klinkara : క్లింకార ఫొటోలు షేర్ చేస్తూ.. ఎమోషనల్ వీడియో పెట్టిన రామ్ చరణ్

- Advertisement -

Klinkara : మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, ఉపాస‌న దంప‌తుల జీవితంలో జూన్ 20 ఎంతో కీల‌కం. ఎందుకంటే ఆరోజున క్లీంకార మెగా కుటుంబంలోకి అడుగుపెట్టింది. దీనిపై మెగాభిమానులు, కుటుంబ స‌భ్యులు ఎంతో ఆనందంతో పండగ చేసుకున్నారు. ఇక ఈరోజు క్లీంకార రాకకు సంబంధించిన హృద‌యానికి హ‌త్తుకునే అంద‌మైన వీడియోను విడుద‌ల చేశారు. యాదృచ్చికంగానే జ‌రిగిన‌ప్ప‌టికీ గురువారంతో పాప పుట్టి నెల రోజులే అవుతుంది. గురువారం రోజునే ఉపాస‌న పుట్టిన‌రోజు కావ‌టం విశేషం. క్లీంకార వన్ మంత్ బ‌ర్త్ డేట్ వీడియోను టాలెంటెడ్ ఫిల్మ్ మేక‌ర్‌ జోసెఫ్ ప్ర‌త‌నిక్ డైరెక్ట్ చేసి నిర్మించారు.

Klinkara :
Klinkara :

ఈ వీడియోలో లెజెండ్రీ యాక్ట‌ర్ మెగాస్టార్ చిరంజీవి, ఆయ‌న సతీమ‌ణి సురేఖా కొణిదెలతో పాటు ఉపాస‌న త‌ల్లిండ్రులు శోభా కామినేని, అనీల్ కామినేని, కుటుంబ స‌భ్యులంద‌రూ ఉన్నారు. క్లీంకార పుట్టిన త‌ర్వాత కుటుంబ స‌భ్యులు, అభిమానులు అంద‌రూ పండుగ చేసుకున్నారు. వాట‌న్నింటినీ వీడియోలో అందంగా చూపించారు. ఈ భావోద్వేగం గురించి మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ మాట్లాడుతూ క్లీంకార పుట్టే స‌మ‌యంలో మా అంద‌రిలోనూ తెలియ‌ని టెన్ష‌న్‌. అంతా స‌రిగ్గా జ‌ర‌గాల‌ని మేం అంద‌రూ ప్రార్థిస్తున్నాం. అందుకు త‌గిన‌ట్టే అన్నీ అనుకూలంగా మారి స‌రైన స‌మ‌యం కుద‌ర‌టంతో పాప ఈ లోకంలోకి అడుగు పెట్టింద‌ని భావిస్తున్నాను. పాప పుట్టిన ఆ క్ష‌ణం మ‌న‌సుకి ఆహ్లదంగా, చాలా సంతోషంగా అనిపించింది. పాప పుట్ట‌టానికి ప‌ట్టిన 9 నెల‌ల స‌మ‌యం, అప్పుడు జ‌రిగిన ప్రాసెస్ అంతా త‌లుచుకుని హ్యాపీగా ఫీల‌య్యాం అన్నారు.

క్లీంకార రాకకు దారి తీసిన ఆ మ‌ర‌పురాని క్ష‌ణాల‌తో పాటు, పాప‌కు ఆ పేరు పెట్ట‌టానికి కార‌ణ‌మైన అస‌లు క‌థ‌ను కూడా వీడియోలో చూపించారు. ఈ సంద‌ర్భంగా ఉపాస‌న కొణిదెల మాట్లాడుతూ మా పాప ద్రావిడ సంస్కృతిలో భాగం కావాల‌ని నేను కోరుకున్నాను. ఆమె పేరుకి ముందు, వెనుక ఎలాంటి ట్యాగుల‌ను ఇవ్వ‌కండి. అలాంటి వాటిని వారే స్వ‌యంగా సాధించుకోవాల‌ని నా అభిప్రాయం. పిల్ల‌ల పెంప‌కంలో ఇవెంతో ముఖ్య‌మైన‌వి. జీవితంలో ప్ర‌తీ క్ష‌ణాన్ని ఆస్వాదించాలి.మ‌నం అంద‌రితో క‌లిసి సంతోషంగా ఉన్న స‌మ‌యానికి విలువ ఇవ్వాల‌ని నేను భావిస్తాను అన్నారు.

- Advertisement -

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here